–గ్రామస్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాలు పాల్గొనాలి
–బ్యాంకు ఋణాలతో కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టి ఆర్థికంగా పైకి ఎదగాలి
–గ్రామంలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
–పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై మహిళా స్వయం సహాయక సం ఘాల సభ్యులతో సమీక్షా సమా వేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అవకాశం ఉన్న వనరుల ఆధారంగా మండలాల వారీగా యూనిట్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం ద్వారా పైకి ఎదగాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి (Narayana Reddy) ఆకాంక్షించారు. బ్యాంకుల అనుసంధానంతో ఇచ్చే లోన్ల ద్వారా ప్రతి ఒక్కరు ఆదా యం వచ్చే వ్యాపారాలు, మార్గాలు ఏర్పాటు చేసుకునేలా ఏపీఎంలు అవగాహన కల్పించాలని అన్నారు. ఉమ్మడిగా కాకుండా వ్యక్తిగతంగా యూనిట్లు (UNITS) ఏర్పాటు చేసే విషయ మై ఆలోచించాలని, ప్రతి మండ లంలో ప్రతి గ్రామం నుండి ఒక వ్యాపారవేత్త (businessman) తయారయ్యేలా మహిళా సంఘాలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.బుధ వారం అయన నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో (Near Nalgonda District Centre) ఉన్న జిల్లా సమాఖ్య భవనంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తున్నదని, ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పగించిందని, అంతేకాక క్యాంటీన్ల నిర్వహణ, ఇతర వ్యాపారాల వంటి వాటిని సైతం అప్పగించడం జరుగు తున్నదని ,అందువల్ల మహిళా సంఘాల సభ్యులు వీటిలో ఇంకా ప్రావీణ్యం సంపాదించి ఆర్థికంగా పైకి రావాలని కోరారు.
వ్యాపా రంలో విజయం సాధించేందుకు ఎలాంటి వ్యాపారాలు చేపడితే బాగుంటుందో ప్రణా ప్రణాళిక (Life plan) రూపొందించుకోవాలని తెలిపారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, పాడిగేదెలు, మీ-సేవ కేంద్రాలు, కష్టం హైరింగ్ సెంటర్లు ,అల్లికలు తదితర యూనిట్ల ద్వారా ఇదివరకే జిల్లాలోని మహిళా సంఘాలు కార్యక్రమాలు (Women’s Associations Programmes) నిర్వహిస్తున్నప్పటికీ ఈ పనులలో నాణ్యతతో పాటు, లక్ష్యాలను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. చేపట్టిన ప్రతి ఆర్థిక కార్యక్రమం క్షేత్రస్థాయిలో సరైన విధంగా అమలు కావాలని, ప్రస్తుతం నిర్వహిస్తున్న యూని ఫాంల కుట్టు పనిని ఇంకా మెరుగ్గా చేపట్టాలని, పనిలో నాణ్య త ఉండాలని, ఇంకా ఏదైనా ప్రభుత్వ పనులు ఇచ్చినప్పటికి నిర్వహిం చేలా మహిళలు తయారు కావాల ని, రెండవ విడత దుస్తులను త్వరగా కుట్టి ఇవ్వాలని అన్నారు. పాడి గేదెల పెంపకం (Rearing of dairy buffaloes) మంచి లాభాలను ఇస్తుందని, గ్రామస్థా యిలో ఇది ఒక మంచి వ్యాపారం అని అన్నారు. జిల్లాలో లక్ష్యాన్ని 5000 వరకు పెంచాలని సూచిం చారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, కష్టం మిల్లింగ్ సెంటర్ల ద్వారా ఏపిఎంలో చురుకుగా ఉండి మహిళలు అవగాహన కల్పించా లన్నారు.
ప్రతి ఏపిఎం (MP) వారి పరిధి లో కొత్త వ్యాపారాలు నిర్వహిం చేందుకు ఆలోచించాలని , ఆర్థిక కార్యక్రమాలతో పాటు, మహిళలు గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొ నాలని, ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మహిళా సంఘా లకు అప్పగించడం జరిగిందని, వాటిలో పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు నాణ్య త ఉండేలా చూడాలని అన్నారు. గ్రామ స్థాయిలో విద్య, వైద్యంపై మహిళా సం ఘాలు ఎక్కువ దృష్టి కేంద్రీక రించాలని, పాఠశాలల్లో పనులతో పాటు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి సౌక ర్యాలు ఉన్నాయో లేదో పరిశీ లించాలని, అలాగే వాటి పుస్తకాలు, యూనిఫార్మ్స్ అందరికీ అందినది లేనిది పరిశీలించా లన్నా రు. అలాగే వైద్యం విషయం లో సైతం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి మహిళల ఆరోగ్య విషయంపై జాగ్రత్తలు తీసుకోవా లని, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్లు Cesareans)తగ్గించేలా చూడాల్సిన అవసరం ఉందని, గర్భిణీ స్త్రీలు తప్పని సరిగా యాంటినెంటల్ చెక్ అప్ ను చేయించుకునేలా అవగాహన కల్పించాలని, గ్రామ, మండల స్థాయిలో నిర్వహించే అన్ని సమావేశాలలో విద్యా, వైద్యం పై చర్చ జరిపేలా ఉండాలని సూచించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర,డి ఆర్ డివో నాగిరెడ్డి మాట్లాడారు. జిల్లా సమాఖ్య ప్రతినిధులు మహి ళలు హాజరయ్యారు.