–ప్రభుత్వ వైద్యులు సాధారణ ప్రసవాలపైనే ఎక్కువ దృష్టి
–ప్రతి ఒక్కరూ విధులలో సమయ పాలన పాటించాలి
–సీజనల్ వ్యాధులపై దృష్టి సారించండి
— నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: వర్షాకాలం ప్రారంభమైనందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చాలని జిల్లా కలెక్టర్ సి.నారాయ ణరెడ్డి (Narayana Reddy) ఆదేశించారు.మంగళవారం ఆయన తన ఛాంబర్ నుండి జిల్లా లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు (Primary Health Centers), ఉప కేంద్రాలు, ప్రభుత్వ ఆసుప త్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలలో ఏ ఒక్క రు వ్యాధుల బారిన పడకుండా చూ డాలని, ఎక్కడైనా సీజనల్ వ్యాధు లు (Seasonal diseases) ప్రబలినట్లయితే తక్షణమే ఆ యా గ్రామాలకు వెళ్లి చికిత్స అందిం చాలని, అవసరమైతే వైద్య శిబిరా లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ బృందాలతో మెడికల్ బృందాలు (Medical teams)సమన్వయం చేసుకొని వెళ్లాలని తెలిపారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల (Primary Medical Health Centers and Sub Centers)ద్వారా నిరం తరం అందించే సేవలలో ఎలాంటి ఆటంకం లేకుండా అందించాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఎవరైనా అనధికారి కంగా విధులకు గైహాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఇకపై ప్రతి ఆరోగ్య కేంద్రా నికి ఆయా అంశాలపై లక్ష్యాన్ని నిర్దేశించడం జరుగుతుందని, ముఖ్యంగా మండల బృందాల ద్వారా అవుట్ పేషెంట్ల సంఖ్యను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల డాక్టర్లు (DOCTER) తప్పనిసరిగా వైద్యం కోసం వచ్చిన రోగుల నుండి మొబై ల్ నెంబర్ను రిజిస్టర్ చేసుకోవాలని, ఓపిని పద్ధతి ప్రకారం నిర్వహిం చాలని తెలిపారు.ప్రత్యేకించి ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాల ని, సిజేరియన్ తగ్గించాలని అన్నారు. గ్రామ స్థాయి నుండి ఆశ వర్కర్ సరైన విధంగా పనిచేయాలని, గ్రామ స్థాయి బృందంతో కలిసి పని చేయాలని ఆదేశించారు .
ప్రతి గర్భిణి (pregnant) తప్పనిసరిగా వైద్యారోగ్య కేంద్రం లో నమోదు కావాలని, ఎట్టి పరిస్థి తులలో పరీక్షలు తప్పిపోరాదని, ఒకవేళ ఏఎన్సీ జరగకుండా నేరుగా కాన్పుకు వచ్చినట్లయితే సంబం ధిత ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం (Medical Health Center) డాక్టర్లు బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పారు. జిల్లాలోని ఆయా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో గర్భస్రావాలు నమోదు కావడంపై ఈ అంశాన్ని ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ప్రస్తావిస్తూ గర్భస్రా వాలు కావడానికి గల కారణాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పిం చాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదే శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, ఉప కేంద్రాలు సైతం క్రమ పద్ధతిలో పనిచే యాలని, ఇకపై వైద్య ఆరోగ్యశాఖ సంబంధించి ప్రతి రెండు వారాలకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలకు సరైన వైద్యం అందించడ మే కాకుండా, మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా వైద్య ఆరోగ్యశాఖ పనిచేయవల సిన అవసరం ఉందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ చక్రవర్తి, డి సి హెచ్ ఎస్ మాతృనాయక్ తదితరులు హాజరయ్యారు.