–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: గ్రామస్థాయి నుండే ప్రభుత్వ పథకాలు సక్రమం గా అమలు కావాల్సిన అవసరం ఉందని, ఇందుకుగాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామస్థాయిలో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి. నారా యణరెడ్డి (Narayana Reddy) అన్నారు. బుధ వారం అయన జిల్లా కలెక్టర్ కార్యా లయం నుండి మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వచ్చే సోమవారం నుండి నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం (Public radio program), వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ (Video conference)నిర్వహించారు. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, ఆరోగ్యం ఉపాధి హామీ ప్రజా పాలన తదితర అన్ని పథకాలు సరైన విధంగా లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత గ్రామ, మండల స్థాయి టీములపై ఉందని అన్నారు .
గ్రామ,మండల స్థాయి టీములు అన్ని అభివృద్ధి పథకాలు , ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజాపాలన కు సంబంధించిన అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి పథకం కింద టార్గెట్ (target) తో పాటు, పెండింగ్ లబ్ధిదారులు (Pending Beneficiaries), వారి జాబితాను ప్రత్యేకంగా రూపొందించాలని, అలాగే మండల స్థాయి టీములు గ్రామ స్థాయి టీములను పర్యవే క్షించాలని, రాబోయే రోజుల్లో ఆయా పథకాల వారీగా సమీక్షిం చడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయి బృందాలను ఆశావాద దృక్పథంతో తీర్చిదిద్దాలని శానిటేష న్, విద్య సక్రమంగా నడిచేలా చూడడం, అంగన్వాడి ద్వారా పౌష్టికాహారం అందించడం, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అందించే సేవలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం, ఇతర విషయాలు, ఉపాధి హామీ పనులు, గ్రామాలలో విద్యుత్ సమస్యలు, వంటి అంశాలపై గ్రామస్థాయిలో పూర్తి సంతృప్తి కరంగా పనిచేయా లని,అలాగే మున్సిపాలిటీలలో సైతం ఈ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు గ్రామ స్థాయి యంత్రాం గాన్ని సమాయ త్తం చేయాలని అన్నారు.
అధికా రులు పూర్తిగా ప్రజలకు ఉపయోగ పడే పనులు చేయా లని,ఉద్యోగు లు ఎవరైనా అనధి కారికంగా విధులకు గైర్హాజరైతే సస్పెండ్ (suspend) చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నిబంధనలకు అనుకూలంగా ఉన్న పనులు చేయాలని, ప్రజలతో మంచి సత్సంబంధాలను కలిగి ఉండాలని, అలాగే ప్రజాప్ర తినిధు లను కలుపుకొని కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజా సంఘాలు, మీడియాను సైతం పరిగణలో తీసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పను లను చేపట్టడం జరిగిందని ఈ పనులపై శుక్రవారం నుండి ప్రతిరోజు ఎంపీ డీవో (mdo), మున్సిపల్ కమిషనర్, ఇంజ నీర్లతో సమీక్షిస్తానని ఆయన తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచం ద్ర ,జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు (Video conference) హాజరయ్యారు.