Narayana Reddy: ప్రజా దీవెన, మునుగోడు:విద్య, వైద్య ఆరోగ్య సంక్షేమంలో (Education, medical health welfare)భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన మోడల్ ఆస్పత్రులలో ఈనెల 15 నుండి ప్రసవాలతోపాటు, చిన్నపిల్లల వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించా లని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి (C. Narayana Reddy) వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ను ఆదేశించారు. మంగళవారం అయన కలెక్టర్ కార్యాలయం నుండి మోడల్ ఆస్పత్రు లలో వైద్య సౌకర్యాలు, జ్వర సర్వే పై జిల్లాలోని వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16 నుండి వారం రోజులపాటు అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో జ్వర సర్వే నిర్వహించాలని, గ్రామీణ ప్రాంతంలో ఆశ ,అంగన్వాడి కార్యకర్తలు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జ్వర సర్వే నిర్వహించాలని, సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి వివరాలన్నిటిని సేకరించాలని ,ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లయితే తక్షణమే వారికి చికిత్స అందించడమే కాకుండా, వారికి నయం అయ్యేవరకు ప్రతిరోజు వివరాలు తెలుసుకుని సమర్పించాలని ఆదేశించారు .
అలాగే మున్సిపల్ ప్రాంతాలలో సైతం వైద్య ఆరోగ్య శాఖ ( medical health department) శాఖ అధికారులు వార్డ్ అధికారుల ఆధ్వర్యంలో జ్వర సర్వే నిర్వహించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15 నుండి ఎంపిక చేసిన దేవరకొండ ,మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రభుత్వాసుపత్రులతో పాటు, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకుగాను జిల్లాలో పైలెట్ పద్ధతిన మోడల్ ఆస్పత్రులుగా ఎంపిక చేయడం జరిగిందని, ఈ ఆసుపత్రులో ఈనెల 15 నుండి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా 24 గంటలు గర్భిణీ స్త్రీలకు ,చిన్న పిల్లలకు (For pregnant women and small children) వైద్య చికిత్సలందించడం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ఈ డి డి లో నమోదైన వివరాల ప్రకారం ప్రసవాలు నిర్వహించాలని ,అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన చికిత్సలు సైతం ఏలాంటి పొరపాట్లు లేకుండా అందించాల్సిందిగా ఆదేశించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై జిల్లా కలెక్టర్ (District Collector) మాట్లాడుతూ ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations)నిర్వహించాలని ,గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యం లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని, ప్రతి గ్రామంలో, ప్రతి కార్యాలయంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ,ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాతీయ పతాక నిబంధనలను పాటించాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి .పూర్ణచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పోట్లు శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృ నాయక్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు హాజరయ్యారు.