Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్- ఖమ్మం- నల్గొండ (Warangal- Khammam- Nalgonda) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, సాధారణ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ- 2025 అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆర్డిఓ (rdo) లను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు ,ఆర్డీవోలు, తదితరులతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2025 ముందస్తు కార్యక్రమాలు, అనంతరం చేపట్టే కార్యక్రమాలు,ఓటరు అవగాహన కార్యక్రమాలపై హైదరాబాద్ నుం డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదును ఎప్పటికప్పుడే పర్యవేక్షించాలని, వీటిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి అర్హులైన టీచర్లందరూ ఓటరుగా నమోదయ్యేలా ఫారం- 19 లో దరఖాస్తు చేయించాలని, వచ్చిన దరఖాస్తులు అన్నింటిని పరిష్కరిం చడం పై దృష్టి సారించాలని చెప్పారు .
జిల్లాలో సుమారు 3500 నుం డి 4000 మంది టీచర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల (Teachers Upadhyay MLC Election) ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందని, ఈ విషయమై తక్షణమే తహసిల్దారు లు, ఎంపీడీవోలు, ఎంఈఓ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పారు. ఎంఈఓ ద్వారా అన్ని పాఠశాలల హెడ్మాస్టర్ లతో ఆ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు ఓటరు గా నమోదైన టీచర్ల వివ రాలను సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదయ్యే లా చూడాలన్నారు. ఈ మొత్తం ప్రక్రియ ఈనెల 26 లోపు పూర్త య్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ,మండల విద్యాశాఖ అధికారులు (District Education Officer, Mandal Education Officers) ఈ విష యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చాలని కలెక్టర్ చెప్పారు.సాధారణ ఓటరు జాబి తా ప్రత్యేక సవరణ కార్యక్రమం- 2025 ముందస్తు కార్యక్రమా లు,ఓటరు అవగాహన కార్యక్ర మాలపై జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ అర్హులైన వారం దరూ ఓటరు గా నమోద య్యేందు కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, ముఖ్యంగా ఎన్నికల సంఘం ద్వారా వచ్చిన కరపత్రాలు, గోడపత్రికలు అన్నింటిని గ్రామపంచాయతీ స్థాయి వరకు వెళ్లేలా చూడాలని చెప్పారు .
చునావ్ పాఠశాలలో భాగంగా జిల్లాలోని అన్ని ఇంటర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలో లిటరసీ క్లబ్బులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే కళాశాలల్లో క్యాంపస్ అంబా సిడర్లను (Campus ambassadors)నియమించాలన్నారు. నియోజకవర్గాల స్వీప్ నోడల్ అధికారుల ద్వారా ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం తదితర అంశాలపై కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. అలాగే రెండు రోజుల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలపై జిల్లా స్థాయి కార్యా చరణ ప్రణాళిక రూపొం దించాలని జిల్లా పరిషత్ సీఈవో, స్వీప్ నోడల్ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డిని ఆదేశించారు.
అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి (State Chief Electoral Officer Sudarshan Reddy)మాట్లాడుతూ ఓటరు అవగాహన కార్యక్రమాలలో భాగంగా చునావ్ పాఠశాల, ఓటరు అవగాహన కోసం ర్యాలీలు, 2 కె రన్ ,మానవ హారాల వంటివి నిర్వహించాలని, ప్రత్యేకించి ఓటరు జాబితా పై వచ్చిన పారాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని చెప్పారు .స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ, చండూరు ఆర్డీవోలు శ్రీరాములు, సుబ్రమణ్యం, నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తదిత రులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.