Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాలో ఓటర్ల పేర్ల చేర్పులు ,తొలగింపులను పూర్తి జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి (Narayana Reddy) ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా (Voter list)ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి పరిశీలన,పట్టభద్రుల,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పై హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డీవోలతో ఇదే విషయంపై సమీక్ష నిర్వహించారు .
ఎన్నికల సంఘం నియమ నిబంధనలు (Election Commission Rules)ప్రకారం ఫారం -6,7,8 లను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కార్యక్రమం పక్కగా నిర్వహించాలని , ప్రత్యేకించి ఓటరు జాబితాలో చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు,అలాగే చేర్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జాగ్రత్తగా పరిశీలించి చేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల పేర్లతోలగింపు పకడ్బందీగా, నిబంధనల ప్రకారం నిర్వహించా లన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ,తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి పరిశీలన కార్యక్రమం తో పాటు, ఫారం 6, 7, 8 లను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డుల ప్రింటింగ్ కై ఇప్పటివరకు మూడు జిల్లాల నుండి మాత్రమే అప్డేట్ వివరాలు వచ్చాయని, తక్కిన అన్ని జిల్లాలు తక్షణమే సెప్టెంబర్ 24 వరకు అప్డేట్ వివరాలు పంపించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల (Polling centers)హేతుబద్దీకరణ లో భాగంగా బిఎల్వోలు నూటికి నూరు శాతం పోలింగ్ కేంద్రాలను, పోలింగ్ కేంద్రాల లొకేషన్లను పరిశీ లించి ఫోటో అప్లోడ్ చేయాలని తెలిపారు.
పట్టభద్రు ల,ఉపాధ్యా య ఎమ్మెల్సీ (mls) ఎన్నిక లకు సంబం ధించి ఈనెల 30న పబ్లిక్ నోటీసు జారీ చేయడం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈఆర్ఓ ల నియామకంపై సవరించిన ప్రతిపాదనలు పంపాల్సి ఉంటే తక్షణమే పంపించాలని జిల్లా కలెక్టర్లతో కోరారు. ఫారం 6,7,8 లకు సంబంధించి నోటిస్ పీరియడ్ (Notice period)పూర్తయి ఉంటే తక్షణమే వాటిని పరిష్కరించాలని, ఓటరు జాబితా పై ఇంటింటి పరిశీలన తర్వాత కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాద నలు తక్షణమే పంపించాలని ఆదేశించారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారులు పాల్గొనగా,జిల్లా నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, చందూరు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.