–ప్రభుత్వ కార్యాలయాలు, ఆవ రణలు శుభ్రంగా ఉండాలి
–ముఖ్యంగా టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచాలి
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశం
Narayana Reddy:ప్రజా దీవెన,నల్లగొండ:ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో బుధ, గురువారాలు రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)జిల్లా అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన ఈ విషయమై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కార్యాలయాలలో శానిటేషన్ సరిగా ఉండటం లేదని, టాయిలెట్లు (Toilets)సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకుగాను ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ (Sanitation Drive) చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని జిల్లా కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా అధికారితో పాటు, సిబ్బంది పైన ఉందని, వారి కార్యాలయాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా, కలెక్టర్ కార్యాలయంలోని అన్ని కారిడార్లు శుభ్రంగా ఉంచాలన్నారు.
కార్యాలయంలో బూజు, దుమ్ము,ధూళి ఉండకుండా శుభ్రం చేయాలని, అలాగే కార్యాలయ ఆవరణలో, బయటి వైపు ఎలాంటి పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలని, రూఫ్ పైన సైతం ఎలాంటి మొక్కలు, చెత్త,చెదారం ఉండకూడదు అని అన్నారు. రెండు రోజులపాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ (Sanitation Drive) నిర్వహించాలని, రాబోయే నాలుగు రోజులు ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా (water supply), విద్యుత్ సరఫరా (Power supply) ఉండాలని,అలాగే డోర్లు సరిగా ఉండాలని, ఎక్కడైనా అవసరమైతే తక్షణమే మరమ్మతులు చేయించుకోవాలని ఆయన ఆదేశించారు. శనివారం నాటికి అన్ని కార్యాలయాలలో పూర్తి పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం అనంతరం తనతో పాటు ,ఆదనపు కలెక్టర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని కార్యాలయాలతో పాటు, బయట ఉన్న కార్యాలయాలలో సైతం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్య తీసుకుంటామని హెచ్చరించారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సెక్షన్ల విభాగాల అధిపతులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమ యపాలన పాటించాలని ఆదేశించారు .
ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించాలని, విధి నిర్వహణలో ఎలాంటి తప్పులు చేయవద్దని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలని, అదేవిధంగా ఫైళ్లు సైతం జాప్యం లేకుండా పంపించాలని అన్నారు. కలెక్టరేట్ (Collectorate)మొత్తం పూర్తి పరిశుభ్ర తగా ఉండేలా చూడాలని, ఇందుకుగాను అవసరమైనంత మంది పారిశుధ్య కార్మికులను, స్వీపర్లను (Sanitation workers and sweepers) నియమించాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా తయారు చేయించిన రేక్స్ ను అవసరమైన కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళు, ఉన్నత పాఠశాలకు అవసరం ఉన్న పాఠశాలల జాబితాను రూపొందించి వారి అవసరాన్ని బట్టి పంపించాలని చెప్పారు. కలెక్టర్ కార్యాలయం లోని అన్ని టాయిలెట్స్ ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అవసరమైతే స్కావెంజర్స్ సంఖ్యను పెంచా లన్నారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతిలా ల్ ,జిల్లా ఇన్ఫార్మాటిక్ అధికారి గణపతి రావు,ఆయా విభాగాల పర్యవేక్షకులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.కాగా టేలి కాన్ఫె రెన్స్ కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచంద్ర , అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులందరు హాజరయ్యారు.