Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఎంఎస్పీ జిల్లా అధ్య క్షుడు బకరం శ్రీనివాస్ లు కోరారు. ఈరోజు నార్కట్ పల్లి (Norcut Palli)మండలం నక్క లపల్లి గ్రామానికి చెందిన దళితులతో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి (Narayana Reddy) వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్స రాలకు పూర్వం నుండి 1.30 గుంటల భూమి లో స్మశాన వాటిక ఏర్పాటు చేసుకొని సమాధులు కట్టి బొందలు పెట్టడం జరిగిందని తెలిపారు. అట్టి భూమిని గుత్తా సందీప్ రెడ్డి గుత్తా సంధ్యారెడ్డి (Gutta Sandhya Reddy)గుప్తా ప్రేమలత అనువారు అక్రమంగా భూమిని ఆక్రమించి దళితుల సమాధులను ధ్వంసం చేసి అక్కడికి వెళ్లిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేమిదాలో పరిసరాములు, గ్రామ నాయకులు శ్రీపతి సైదులు, గద్దపాటి సైదులు భాషపాక రవికుమార్ జిల్లా పృథ్వీరాజ్ శ్రీపతి వెంకటేశం శ్రీపతి కుమార్ గద్దపాటి కృష్ణ జిల్లా యాదగిరి గడ్డం కాశయ్య తదితరు లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే తగు చర్యలు తీసు కుంటారని హామీ ఇవ్వడం జరిగింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.