— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం లో ఈనెల 16 నుండి 19 వరకు నిర్వహించనున్న స య్యద్ లతీప్ ఉల్లా షా ఖాద్రి ఉర్స్ ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడా లని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) అన్నారు.నల్గొండ పట్టణంలోని సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రి ఉర్సు ఉత్సవాలపై మంగళవారం అయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar)తో కలిసి జిల్లా అధికారుల తో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు.
ఉర్స్ ఉత్సవాలు (Urs utsavālu)గతంలో కంటే ఇంకా బాగా నిర్వహించేలా ప్రణాళికతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు . ఉత్సవాలకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు, శానిటేషన్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. 16న ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 17న గంధం ఊరేగింపు ఉంటుందని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా, శాంతియుతంగా ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో కోరారు. ఆర్డీవో డిఎస్పీ లు (RDO DSPs)ఉత్సవాలను పర్యవేక్షించాలని చెప్పారు. ఉర్సు ఉత్సవాలు జరిగే చోట తాగునీరు, శానిటేషన్ ను నల్గొండ మున్సిపల్ కమిషనర్ , జిల్లా పంచాయతీ అధికారి మిషన్ భగీరథ ఎస్.ఈ లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar)మాట్లాడుతూ సయ్యద్ లతీఫ్ ఉల్లా షా ఖాద్రి ఉర్సు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకుగాను సంబంధిత అధికారులు అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి ఉత్సవాలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉర్సు ఉత్సవాలు జరిగే చోట పార్కింగ్, క్యూ లైన్ల ఏర్పాటు, బ్యారికేడింగ్ వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు. రాత్రి సమయంలో బందోబస్తుకు గార్డును ఏర్పాటు చేస్తామని, ట్రాఫిక్ ను నియం త్రించడం జరుగుతుందని, సీసీ కెమెరాలు (CC cameras)సైతం ఏర్పాటు చేయ నున్నట్లు ఆయన వెల్లడిం చారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఇన్చార్జి ఆర్డిఓ శ్రీదేవి, పలువురు జిల్లా అధికారులు డిఎ స్పి శివరామిరెడ్డి, నల్గొండ మున్సి పల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, పోలీస్, ఇతర అధికారు లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.