Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: ద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను పూర్తిచేయాలి

— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయ ణ రెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలోని అన్ని కేజీబీవీలు, మోడల్ పాఠశాలలో విద్యార్థుల కు స్క్రీనింగ్ పరీక్షలను పూర్తిచేయాల ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి (Narayana Reddy)ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోషణ అభియాన్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ (Department of Women and Child Welfare) అంగ న్వాడీ సూపర్వైజర్లు, సిడిపిఓలు, అంగన్ వాడి టీచర్లతో నిర్వహిం చిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ, సిడిపిఓలు, వైద్యాధికా రులు ఆర్ బి ఎస్ కే కింద (Teachers are nutritionists)అన్ని కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని అన్నారు. అలాగే అంగన్వాడి టీచర్లు పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు, వయసుకు తగ్గ బరువు లేమితో బాధపడు తున్న పిల్లలను గుర్తించాల ని ,అనంతరం వారికి సరైన పౌష్టి కాహారం అందించేం దుకు ప్రణాళిక రూపొందించా లని ,ఈ విషయం లో తల్లిదండ్రుల కు సైతం అవగా హన కల్పించేలా చర్యలు తీసుకో వాలని సూచిం చారు.

జిల్లాలోని నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (Hospital) తో పాటు, దేవరక ద్ర,మిర్యాల గూడ ,నాగార్జునసాగర్ ప్రభుత్వా సుపత్రులలో 24 గంటలు ప్రసవా లు జరిగే విధంగా ఏర్పాట్లు, సౌక ర్యాలు కల్పించడం జరిగిం దని, అందువలన అంగన్వాడీ టీచర్లు ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖ కు పూర్తి సహ కారం అందించాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు డెలివరీలు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు అయ్యేలా చూడాలని, దీనివల్ల ఆపరేషన్లు జరిగే సంఖ్య తగ్గుతుందని తెలిపారు. అలాగే మహిళ గర్భం దాల్చిన తర్వాత తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రతినెలా క్రమం తప్పకుండా ఏఎన్ సి పరిశీలన, మందులు వినియో గం తదితర వాటన్నింటిపై నిర్లక్ష్యం లేకుండా డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ తప్పనిస రిగా ఇవ్వాలన్నారు. ప్రాథమిక పూర్వ విద్యను అంగ న్వాడి కేంద్రాల ద్వారా తప్ప నిసరి గా ఇవ్వాలని, ఇందు కుగాను అంగన్వాడీ కేంద్రాలు పద్ధతి ప్రకారం పని చేయాలని అన్నారు.

అంగన్వాడీ టీచర్లు (Anganwadi teachers)ప్రత్యేకించి పని విభజనను చేసుకోవాలని, ప్రభుత్వం నిర్దే శిం చిన సమయం ప్రకారం కేంద్రాలు పని చేయాలని,ఉదయం 9 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నూటికి నూరు శాతం కేం గంటలను నడపాలని, అంగన్వా డి కేంద్రంలో చేరిన పిల్లల హాజరు తప్పనిసరిగా 90% ఉండా లని, ప్రభుత్వం అనుమ తించిన ఆమోదించిన సిలబస్ ను తప్పకుండా పిల్లలకు బోధించాల ని ,నెలవారీగా చేసే కార్యక్రమాలపై షెడ్యూల్ ను రూ పొందించాలని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే సేవలను సరై న విధంగా లబ్ధిదారు లకు అందించే విధంగా చూడాలని, రికార్డులను సవ్యంగా నిర్వహిం చాలని అన్నారు. ఇకపై గ్రామపం చాయతీ తనిఖి సందర్భంగా అంగ న్వాడి కేంద్రాలను (Anganwadi centers) సైతం తనిఖీ చేస్తామని చెప్పారు. మరుగుదొడ్లు లేని 240 అంగన్వాడి కేంద్రాలలో రానున్న 15 రోజుల్లో నిర్మించాలని డిపిఓ ను ఆదేశించారు.అనంతరం అంగన్వా డి టీచర్లు నిర్వహించే బి ఎల్ ఓ విధులు, తదిత అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా సంక్షేమ అధికారి సక్కు బాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ ఇన్చార్జి అధికారి రాజ్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, డిపి ఓ మురళి, మెప్మా పీడీ కరుణాకర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోషణ అభియాన్ పై రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.