–సెప్టెంబర్ 30 నాటికి రెండు సీజన్ల కష్టం మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని మిల్లర్లు పూర్తి చేయాల్సిందే
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారా యణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్ర భుత్వం నిర్దేశించిన సెప్టెంబర్ 30 లోపు గత వానాకాలం, యాసంగికి సంబంధించిన సిఎంఆర్ డెలివరీని రైస్ మిల్లర్లు పూర్తిచేసి తీరాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) కోరారు.శుక్రవారం అయన జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎం ఆర్ పై సమావేశం నిర్వహించారు. మిల్లర్లు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన సీఎంఆర్ CMR)లక్ష్యం పూర్తవుతుందని, అందువల్ల సీఎంఆర్ డెలివరీ విషయంలో మిల్లర్లు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో ధాన్యం దుర్వినియోగం అయ్యె పరిస్థితి తీసుకురావద్దని, ప్రభుత్వం నుండి తీసుకున్న ధాన్యం మొత్తం తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా మిల్లర్లు కృషి చేయాలని , ఎవరైనా ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వస్తే తమ దృష్టికి తీసుకురావాలని , సీఎంఆర్ ( CMR) విషయాన్ని మిల్లర్లు ముఖ్యమైన అంశంగా తీసుకోవాలని, జిల్లాకు ఎట్టి పరిస్థితులలో చెడ్డ పేరు తీసుకురావద్దని ఆయన కోరారు.
అలాగే 2022- 23 సంవత్సరానికి సంబంధించిన వేలం ధాన్యాన్ని సైతం టెండర్లు పొందిన మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని, ఈ విషయమై వచ్చే బుధవారం సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ (Collector) వెల్లడించారు.రానున్న సీజన్లో ధాన్యం సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు సలహాలు ,సూచనలను జిల్లా కలెక్టర్ కోరగా, సన్నధాన్యం 67 నుండి 60 శాతానికి తగ్గించాలని ,15 రోజుల గడువును పెంచాలని, కొత్త గన్ని బ్యాగులు ఇవ్వాలని , ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం రకాల వారిగా వేరువేరుగా కొనుగోలు చేయాలని, వింగ్స్ సాఫ్ట్వేర్ (Wings software)ను సరళీకృతం చేయా లని, మిల్లుల నుండి ధాన్యాన్ని వెంటనే తీసుకునేలా చర్యలు తీసుకోవా లని మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వారి సమస్యలన్నింటిని ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా కలెక్టర్ తెలి పారు. అంతకుముందు అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ సీజన్ ధాన్యాన్ని అదే సీజన్లో సీఎంఆర్ డెలివరీ చేయాలని ఆదేశించడం జరిగిందని, గత వానాకాలం , యాసంగికి సంబంధించిన సిఎంఆర్ సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలన్నారు.
వానకాలానికి సంబంధించి 2 లక్షల పదహారు వేల మెట్రిక్ టన్నులకు (per metric ton) గాను, 1,62,000 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ (cmr) ను మిల్లర్లు చెల్లించారని ,ఇంకా 54,000 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సి ఉందని, యాసంగికి సంబంధించి 2 లక్షల ఇరవై ఒక్కవేల మెట్రిక్ టన్నులకు గాను, లక్ష ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు డెలివరీ చేశారని ,ఈ రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ను వేగవంతం చేయాలని కోరారు. సీఎంఆర్ డెలివరీ విషయంలో పౌరసరఫరాలు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నిరంతరం మిల్లులను సందర్శిస్తున్నారని, తాము సైతం మిల్లర్లతో సమావేశం నిర్వహించి సిఎంఆర్ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటు న్నట్లు వివరించారు. జిల్లా పౌరసర ఫరాల మేనేజర్ హరీష్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వ ర్లు ,ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా అసిస్టెంట్ మేనేజర్, ప్రోక్యూ ర్మెంట్ మేనేజర్ శ్రీనివాస్, రైస్ మిల్లర్లు, పార సరఫరాల ఎన్ఫో ర్స్మెంట్ సిబ్బంది, తదితరులు హాజ రయ్యారు.