Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: ఉదయ సముద్రం ఆయకట్టు రైతులందరికీ సాగునీరు

— నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ఉదయ సముద్రం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు రైతులం దరికీ త్వరలో నే సాగునీరు వస్తుం దని అందువల్ల రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)స్పష్టం చేశారు. గురువారం ఆయన ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సాగు నీరు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ ను అలాగే ఉదయ సముద్రం నుండి నీరు బయటకు వెళ్లే ఔట్ ఫాల్ రెగ్యులటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కంపల్లి రిజర్వాయర్ హై లెవెల్ కెనాల్ (Level Canal) ద్వారా ఉదయ సముద్రంలోకి నీరు వస్తుండగా, ఉదయసముద్రం నుండి డి-39 ,డి-40 ద్వారా ఆయకట్టు భూములకు కెనాల్ (Canal) ద్వారా నీరు వెళ్ళటాన్ని కలెక్టర్ పరిశీలించారు.

డి-39 కింద 10 వేల ఎకరాలు , డి-40 కింద 27 వేల ఎకరాలు సాగు అవుతుండగా, నీటిమట్టం (water level) పెరిగిన తర్వాత కింది భాగంలో ఉన్న అన్ని చెరువులను, కుంటల ను నింపాలని ఇంజనీరింగ్ అధికా రులను ఆదేశించా రు.నాగార్జున సాగర్ ప్రాజక్ట్ లో సరిపోయినంత నీరు ఉన్నందున రైతులు ఎవరు తొంద రపడి సాగునీటిని మళ్లించ వద్దని కోరారు .హై లెవెల్ కెనాల్ కింద మూసి రివర్ కింది భాగంలో ఉన్న డి -55 వరకు నీరు అందించే ప్రయత్నాన్ని చేస్తామని కలెక్టర్ (Collector) తెలిపారు. ఉదయ సముద్రం కింద ఉన్న ఆయకట్టు రైతులు అందరికీ సాగునీరు వస్తుందని, అందువల్ల ఎవరు ఆందోళన చెందవద్దని తొందరపడి నీటిని మళ్లించుకోవద్ద ని ఆయన పునరుద్ఘాటించారు. జిల్లా కలెక్టర్ వెంట ఈ ఈ లుజి .శ్రీనివాస్ రెడ్డి ,సురేందర్ రావు, డి ఈ ఆనందరావు, ఏఈలు, లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, తదితరులు ఉన్నారు.