–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: హెచ్ఐవి (hiv) కేసులను తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) అన్నారు. ప్రత్యేకించి కేసులు ఎక్కువ గా వచ్చేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలని, తెలిపారు. గురువారం అయన జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగా హన ,చికిత్స కోసం ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియం త్రణ సంస్థ (AIDS Control Organization)ద్వారా జిల్లాకు కేటా యించిన “సంచార సమీకృత హెచ్ఐవి పరీక్ష వాహనాన్ని” జండా ఊపి ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాలు, వాహన సౌకర్యం లేని ప్రాంతాలలో హెచ్ఐవి కేసుల (HIV cases) గుర్తింపు, బాధితులకు చికిత్స అందించేందుకు ఈ వాహనం బాగా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రజలు హెచ్ఐవి బారిన పడకుండా కౌన్సిలింగ్ చేయడం, అవగాహన తీసుకు వచ్చేందుకు గ్రామీణ ప్రాంతాలకు ఒక మంచి అవకాశమని , ఈ వాహనం ద్వారా ఎయిడ్స్ పై అవగాహనతో పాటు, చికిత్స, అలాగే కౌన్సిలింగ్, రక్త పరీక్షలు వంటివి నిర్వహించడం జరుగుతుందని, ఎక్కడైనా పాజిటివ్ కేసులు వస్తే చికిత్స అందించడానికి అవకాశం ఉందని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎయిడ్స్ పాజిటివ్ (AIDS positive) సోకినట్లయితే ముందే గుర్తించి చికిత్స అందిస్తే బిడ్డకు నెగటివ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కాగా ఈ సంచార సమీకృత హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్ష వాహనాన్ని రాష్ట్రంలోని 10 జిల్లాలకు కేటాయించగా, అందులో నల్గొండ జిల్లా ఒకటి. దీనిని దృష్టిలో ఉంచుకొని హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ కేసులు తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (Health Officer) పుట్ల శ్రీనివాస్, ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ అరుంధతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, జిల్లా ఎయిడ్స్ ప్రాజెక్టు మేనేజర్ సుధాకర్, సూపర్వైజర్ సంపతయ్య, తదితరులు పాల్గొన్నారు.