–స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్ర మంలో అన్నారం గ్రామాన్ని సంద ర్శించిన కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ” ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పుడు అన్ని సౌకర్యాలు,మందులు ఉన్నాయి. అవసరమైతేనే సిజేరియన్ ఆపరేషన్లు (Cesarean operations)చేస్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే ఎలాంటి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల మీరు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలి” అని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్ర మంలో భాగంగా మంగళవారం ఆయన నల్గొండ మండలం గట్టు కింది అన్నారం గ్రామాన్ని ఆకస్మి ఖంగా తనకి చేశారు. జిల్లా కలెక్టర్ గ్రామం మొత్తం కలియతిరి గారు. పాఠశాల పక్కన పెంటకుప్ప ఉండడాన్ని గమనించి సంబంధిత వ్యక్తిని అప్పటికప్పుడే పిలిపించి వారం రోజుల్లో పెంట కుప్పను తీసివేయాలని ఆదేశిం చారు. గ్రామం మధ్యలో మురికి నీరు రోడ్డుపైన ప్రవహిస్తుండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే సోక్ పిట్ల నిర్మాణాన్ని చేపట్టాలని పంచాయ తీ కార్యదర్శి సాయి చరణ్ కుమార్,ఏ పి ఓ స్ఫూర్తి ని ఆదేశించారు.
అక్కడక్కడ రోడ్లపై వర్షపు నీరు (rain water)నిలిచి ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ తక్షణమే మొరం లేదా మట్టి వేయించి నీరు నిల్వ ఉండకుండా చూడాలని, గ్రామ ఇన్చార్జి అధికారి, మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ షఫీ ఉద్దీన్ ను ఆదేశించారు. గ్రామం లోని కొన్ని ఇళ్లకు మిషన్ భగీరథ తాగునీరు రావడంలేదని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, గ్రామం మొత్తాన్ని తిరిగి తాగునీటిని తనిఖీచేయాలని, తాగునీరు రాని ఇళ్లకు తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డబ్ల్యూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ (S Assistant Engineer)ను ఆదేశించారు. దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రే చేయించాలని అన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ఆచారి జయశంకర్ జయంతి ఎందుకు జరుపుకుంటున్నామని? ఆచార్య జయశంకర్ ఎవరని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో కేవలం 15 మంది విద్యార్థులు మాత్రమే ఉండడం పట్ల విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇల్లిల్లు తిరిగి తీసుకురావాలని సూచించారు.పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి అక్కడ పిల్లల సంఖ్య ,పిల్లలకు పెడుతున్న ఆహారం వివరాలను, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు (Pregnant women and infants), వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూలైలో ఎన్ని కాన్పులు అయ్యాయని? ఈ నెలలో ఎంత మంది కాన్పుకు ఉన్నారని పక్కనే ఉన్న ఆశ కార్యకర్త ద్వారా అడిగి తెలుసుకున్నారు.
గత నెల 3 ప్రసవాలు కాగా, ఈనెలలో ఒకరు ఉన్నారని ఆశ తెలిపారు. గత నెలలో ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రికి ప్రసవానికి వెళ్లగా, ఒకరు మాత్రమే ప్రభుత్వాసుపత్రికి వచ్చారని ఆశ తెలుపగా, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు సరిగా పరీక్షించరని, అక్కడున్న మహిళలు ప్రభుత్వ ఆసుపత్రుల (Women in government hospitals) పై అప నమ్మకం వెలిబుచ్చగా ఇందుకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, గతంలో లాగా లేవని, కాన్పుల కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే డబ్బు ఖర్చుతో పాటు,ఆపరేషన్ వల్ల ఆరోగ్యం పాడవుతుందని, సాధారణ ప్రసవాలు జరిపేందుకే కృషి చేయాలని, ప్రభుత్వాసుపత్రిలో ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అందువల్ల ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు సేవలను వినియోగిం చుకోవాలని చెప్పారు.
ఉదాహ రణకు 100 ప్రసవాలు జరిగితే అందులో 65 ప్రసవాలు ఆపరేషన్ల ద్వారా జరిగితే, 35 మాత్రమే సాధారణ ప్రసవాలు అవుతున్నాయని, ఇందుకు కారణం ఇప్పటి తరం నొప్పులు భరించలేకపోవడం, ఓపిక లేకపోవడం, తల్లిదండ్రులు సైతం పిల్లలు ఇబ్బందులు పడకూడదు అన్న ఉద్దేశంతో సిజేరియన్ చేయిస్తున్నారని, పూర్వకాలంలో అన్ని సాధారణ ప్రసవాలు జరిగేవని, అలాంటిది ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆపరేషన్లు చేయిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతోపాటు, ఐసీయూ, మందులు (Along with doctors, ICU, medicines) అన్ని రకాల సర్వీసులు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నదని, వీటి సేవలను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఒక మ హిళ తనకు కొత్తగా పెన్షన్ రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఆగస్టు 15 తర్వాత కొత్త పెన్షన్లు వస్తాయని కలెక్టర్ తెలిపారు. గ్రామానికి బస్సు లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుపగా 3 రోజుల్లో బస్సు సౌకర్యాన్ని (Bus facility) ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు 3 నెలలుగా కూలి రాలేదని చెప్పగా, వారికి కూలి డబ్బులు చెల్లించే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గొల్లగూడ -2 రిజర్వ్ ఫారెస్ట్ లో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కును తనిఖీ చేసి అక్కడ మొక్కల పెంపకాన్ని ,పార్కును పరిశీలించారు. పట్టణ పార్కును మరింతగా తీర్చిదిద్దేందుకు గాను ప్రత్యేకించి గడ్డి తీయడం,బెంచిలు ఏర్పాటు చేయడం,బోర్డ్ ఏర్పాటు, ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి వి.సుధాకర్ రెడ్డి ని ఆదేశించారు.ఇందుకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.నల్గొండ ఆర్డీ ఓ రవి తది తరులు ఉన్నారు