— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రులపై (Government hospitals) వచ్చే ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నా రాయణరెడ్డి (Narayana Reddy) తెలిపారు. అందువల్ల జిల్లాలోని అన్ని ఏరియా ఆసుప త్రులు, క మ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల (Community Health Centres, Primary Medical Health Centres) లోని డాక్ట ర్లు ,సిబ్బంది వారి వారి ఆసు పత్రులపై ఫిర్యాదులు రాకుం డా చూసుకోవాలని ఆయన కోరారు. వైద్యం కోసం ఆసుప త్రుల కు వచ్చే రోగుల పట్ల స్నేహపూ ర్వకంగా మెల గాలని, వారిని దుర్భాషలాడవద్దని అన్నారు. బుధవారం ఆయన నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుప త్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురు ష, మహిళ వార్డులు, ల్యాబ్, ఎమర్జెన్సీ వార్డు లను సందర్శించి వైద్యం కోసం ఆసుప త్రికి వచ్చిన పలువురు రోగులతో మాట్లాడారు. ఎక్కువమంది జ్వరము , వంటి నొప్పులు,తదితర కారణాలతో ఆస్పత్రికి వస్తున్నారని గమనించిన ఆయన ఏ మండలాలు, గ్రామాల వారు వస్తున్నారని డాక్టర్లను అడిగారు.
గడిచిన వారం రోజుల నివేదికను ఆధారం చేసుకుని ఏ ఏ మండలాల నుండి జ్వరపీడితులు ఎక్కువగా వస్తున్నారో సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ కుమార్ ను ఆదేశించారు. ఆస్పత్రిలో మందులు సరిపడా ఉన్నాయా ఫ్లూయిడ్స్ ,ఆంటీ బయోటిక్స్ ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.ల్యాబ్ ని సందర్శించి ల్యాబ్ రిపోర్ట్స్ (Lab reports)ను పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని టెస్టులు టి- హబ్ కు వస్తున్నాయని అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని ?ఎక్కడినుండి ఎక్కువగా శాంపిల్స్ వస్తున్నాయని? అడిగారు.మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్ నుండి శాంపిల్స్ తమకు వస్తున్నట్లు లాబ్ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. అలాగే జిజిహెచ్ నల్గొండ నుండి ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు నిర్వహించిన టెస్టులలో గత నెల, ఈనెల డెంగ్యూ,చికెన్ గుణ్య కేసుల వివరాలను అడిగి తెలుసుకు న్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేసే సమయానికి 200 శాంపిల్స్ ని కలెక్ట్ చేసి 98 టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ల్యాబ్ ద్వారా నిర్వహించే టెస్టులలో (tests) ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. టీ- హబ్ నిర్వాహకులు ,ల్యాబ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆయన ఆదేశించారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డులో శానిటేషన్ సిబ్బంది, నర్సులు ఏఎన్ ఎం లతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో సౌమ్యంగా మాట్లా డాలని, ఎవరిని దుర్భాషలాడి మనసు నొప్పించడం వంటివి చేయవద్దని, ఒకవేళ అలాంటివి తమ దృష్టికి వచ్చినట్లయితే సంబం ధితులపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని (Lab reports) అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పురుష మెడికల్ వార్డును (Male Medical Ward) సందర్శించి అక్కడున్న ప్రతి రోగితో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఏ ఊరు నుండి వచ్చారని ఎందుకొచ్చారని ఆస్పత్రిలో ఎప్పుడు జాయిన్ అయ్యారని ఇప్పుడు ఎలా ఉందని తదితర ప్రశ్నలు అడిగారు. రోగులపట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డాక్టర్లకు, ఆసుపత్రి సిబ్బం దికి సూచించారు. జిల్లా ఆస్పత్రి ద్వారా మంచి సేవలు అందించేం దుకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన పూర్తి సహా య, సహకారాలను అంద జేస్తామని, అందువల్ల ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది సేవా భావంతో పనిచేయాలని ఆయన కోరారు. జిల్లా కార్మిక శాఖ ఉప కమిషన్ శ్యాంసుందర్ జాదు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు జిల్లా కలెక్టర్ ఉన్నారు