Dalit caste: దళితజాతి బాగుపడాలంటే నరేంద్ర మోడీ గెలవాలి
దళిత బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే, దళితుల అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గెలవాలి. నల్లగొండలో శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించాలని దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ పిలుపునిచ్చారు.
దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్
ప్రజా దీవెన నల్లగొండ: దళిత బిడ్డలు(Dalit caste) భవిష్యత్తు బాగుండాలంటే, దళితుల అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గెలవాలి. నల్లగొండలో శానంపూడి సైదిరెడ్డి(Sanampudi saidi reddy) ని గెలిపించాలని దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ పార్లమెంట్ పరిధిలో దళిత మోర్చా సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కమలం పువ్వు(BJP) గుర్తుకు ఓటు వేసి బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని అన్నారు.
నరేంద్ర మోడీ, మూడోసారి ప్రభుత్వం ఏర్పడితే ఇంకా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని దేశ భవిష్యత్తు పునర్నిర్మాణం చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి, రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగిలయ్య, పార్లమెంట్ ప్రబారి చాలా శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, పోతేపాక సాంబయ్య, జిల్లా అధికార ప్రతినిధి పెరిక ముని కుమార్, దీపంగి జగ్జీవన్ రావు, భాకి నరసింహా, గోలి ప్రభాకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Narendra Modi develop Dalit caste