ప్రజాదీవెన, నల్గొండ టౌన్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు ఈనెల 1వ తారీఖు నుండి 31 వ తారీకు వరకు నిర్వహించబడుతున్నాయి. దానిలో భాగంగా నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జానీ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ డిపో నందు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీమతి డాక్టర్ ఎన్ వాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నల్గొండ రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 0.02% యాక్సిడెంట్ రేట్ తగ్గించడం జరిగినదని అని తెలుపుతూ దీనికి కారణం డ్రైవర్ల అందరికీ ఎప్పటికప్పుడు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డిఫెన్స్ డ్రైవింగ్ పట్ల అవగాహన తెలియజేస్తూ ప్రమాదాలు తగ్గించినామని చెప్పినారు.
ఈ సంవత్సరం జీరో యాక్సిడెంట్ ఉండే విధంగా ప్రయత్నం చేయాలని డ్రైవర్ లందరికీ సూచించారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి యొక్క సందేశంలో ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా చేసే పని పట్ల ఏకాగ్రతతో చేస్తే ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉన్నదని తెలియజేసినారు మరియు ఉద్యోగులందరితో భద్రతా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి మరియు ఇతర ఎంవిఐలు లు లావణ్య, కొండయ్య, మల్లికార్జున్ రెడ్డి, ఏ ఎం వి ఐ లు మరియు డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.