–సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పీడిత ప్రజలపక్షంగా రైతు కార్మిక వర్గపక్షపాతిగా నిలబడి అసమాన త్యాగాలతో సిపిఐ నిర్మితమైనదని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. గురువారం సిపి ఐ 100 సంవత్సరాల ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం సత్యం మాట్లాడుతూ సామ్రాజ్యవా దానికి వ్యతిరేకంగా భూస్వామ్యం పెట్టుబడుదారి విధానాలకు వ్యతిరేకంగా అలుపె రుగని పోరాటాలు నిర్వహించిన చరిత్ర కమ్యూని స్టులని అన్నారు.
భూ సమస్యను ఎజెండగా చేసుకొని లక్షలాది ఎకరాలు ప్రజలకు పంచి దళిత గిరిజన వర్గాల హక్కుల కోసం పోరాడి ఈ 100 సంవత్సరా లు సుదీర్ఘ ప్రయాణం సాగించి ఆర్థిక అసమానతలు లేని దోపిడీ పీడన లేని నూతన సమాజం స్థాపనే ధ్యేయంగా పనిచేస్తుందని ఇవాళ కార్పొరేట్ రాజకీయాల వల్ల చట్టసభలలో బలహీనంగా ఉన్న రాబోయే రోజుల్లో కమ్యూనిస్టుల పాత్ర కీలకంగా ఉంటదని అన్నారు మతోన్మాదం పెచ్చరెల్లి దేశ సంపద ని ఆదాని అంబానీ కార్పొరేట్ వర్గా లు దోచుకుం టున్నాయని బిజెపి వారికి ఉపయోగపడే విధంగా పరి పాలన సాగిస్తుందని అన్నారు.
100 సంవ త్సరాల సిపిఐ సుదీర్ఘ ప్రయాణం *డిసెంబర్ 30న నల్లగొండలో శత వార్షికోత్స వాల సభని పెద్ద ఎత్తున నిర్వహి స్తున్నామని దీన్ని కమ్యూనిస్టులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సమావేశం ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ శ్రావణ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు పీవీరస్వామి బి నరసింహ. రమేషు లెనిన్ ముత్యాలు రమ సుజాత ప్రద్యుమ్నారెడ్డి యూసఫ్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.