court building: నేడు నూతన కోర్టు భవనం ప్రారంభం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు భవనాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే నేడు ప్రారంభించనున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హాజరుకానున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే
ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు భవనాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే నేడు ప్రారంభించనున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు టి. వినోద్ కుమార్, కె.లక్ష్మణ్, బి. విజయ్ సేన్ రెడ్డి తో కలిసి ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే నేడు జిల్లా కేంద్రానికి రానున్నారు. తొలుత సాయంత్రం 4:30 గంటలకు జిల్లా కేంద్రంలోని పానగల్లో గల ఛాయా సోమేశ్వరాలయని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు నూతన కోర్టు భవనాన్ని ప్రారంభిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రకటనలో తెలిపారు.
New Nalgonda court building inaugaration