ప్రజదీవెన, నల్గొండ టౌన్ : ఇంటర్ యూనివర్సిటీ క్రీడలలో వివిధ విభాగంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు సత్తా చాటారు. గురువారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన కో-కో మహిళ విభాగంలో జి. మౌనిక మరియు జీ. స్వాతి , కోకో పురుషుల విభాగంలో బి. అనిల్ బి. వినయ్ వి .ఈశ్వర్ కే. శివకుమార్ లు, హాకీ విభాగంలో కే .మహేష్ మరియు ఆర్. లింగస్వామిలు, వాలీబాల్ విభాగంలో ఎస్. రాధాకృష్ణ ఎంపిక కావడం జరిగింది.
వీరంతా త్వరలో చెన్నైలో జరగబోయే సౌత్ జోన్ క్రీడా పోటీలలో కో-కో హాకీ మరియు వాలీబాల్ క్రీడలలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్, ఇంచార్జి పిడి ఆదె మల్లేశం తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం తో పాటు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ లభిస్తుందని తెలిపారు. ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్, అధ్యాపకులు డాక్టర్ మునిస్వామి డాక్టర్ భట్టు కిరీటం, డాక్టర్ అంకుష్, డాక్టర్ వెల్దండి శ్రీధర్ విద్యార్థులను అభినందించారు.