NTR Birth Anniversary: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా నల్లగొండ టిడిపి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నల్గొండ పా ర్లమెంట్ తెలుగుదేశం పార్టీ కన్వీ నర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వ ర్యం లో స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చి రాజ్యా ధికారంలో భాగస్వాములను చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ కే దక్కు తుందని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు.
పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నం దమూరి తారాకరామారావు 29వ వర్ధంతి వేడుకలు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, మాజీ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్డీ ఎల్.వి.యాదవ్, నాయ కులు గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్ కుమార్, ఆకునూరి సత్యనారాయణ, తేలు అన్న రవి, జంపాల చంద్రశేఖర్, ఎం.ఏ.రఫిక్, బక్కతోళ్ల ఇస్తారి, కొండేటి దయా కర్, గుత్తా శంకర్ రెడ్డి, గంగాధర్ స్వరాజ్, కంచనపల్లి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
