Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Oba Society: తల్లి పాలపై అవగాహన

— నల్లగొండ ఓబా సొసైటి ఆధ్వర్యంలో సదస్సు

Oba Society:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తల్లి పాల (mother’s milk)వారాత్సవాలను పురస్కరిం చుకొని నల్లగొండ ఓభా సొసైటి, నల్ల గొండ క్విన్ సీడబ్ల్యూఓ (CWO) లతో పాటు సీడీపీవో సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ డిఎంఏ హాల్ లో గర్భికి స్త్రీలు, పాలిచ్చు తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లిపాల పోష్టo, తల్లి పాల వల్ల నవజాత శిశువులు (Newborn babies) పెరుగుదల సక్రమముగా ఉంటుందని వివరించారు. వారికి ఉబ్బసం, బిగ్గిలం రాకుండా దోహద పడతాయని పేర్కొన్నారు. తల్లి పాలవలన పిల్లలు బరువు ఏక్రమ ముగా పెరుగడంతో పాటు ముందు భవిష్యత్తులో బీపీ, షుగర్ క్యాన్సర్ వంటి జబ్బుల నుంచి బయటపడు తారని చెప్పారు. తల్లులకు రొమ్ము క్యాన్సర్ ముప్పు రాకుండా కాపా డుతాయని తెలిపారు.