ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మెరకు సమగ్ర సర్వ శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని కులావివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశార. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిర వధిక సమ్మె శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించి మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా పాల డుగు నాగార్జున మాట్లాడుతూ విద్యాశాఖలోని సమగ్ర శిక్ష మన రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నా రు. ఈ రంగంలో పనిచేస్తున్న ఉ ద్యోగ ,కార్మికులను రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మరియు రాత పరీక్ష ద్వారా జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ చే ఇంటర్వ్యూలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి వివిధ స్థాయిలలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారూ.
గత 18 సంవత్సరాల నుండి సర్వ శిక్ష ఉద్యోగులు 19600 మంది పాఠశాల విద్య అభివృద్ధి కోసం వారి నైపుణ్యాన్ని మరియు కృషిని అందిస్తున్నారని అన్నారు. ఈ రంగంలో వివక్ష,ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలా వరనని. వీరి స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పే స్కేల్ వర్తింపచేయాలని, ప్రతి ఉద్యోగి కి జీవిత బీమా 10 లక్షలు ,ఆరోగ్య బీమా 10 లక్షలు సౌకర్యం కల్పించాలని, పదవి విరమణ చేస్తున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి హనుమకొండ సభలో ఇచ్చిన హామీ ప్రకారం సర్వ శిక్ష ఉద్యోగుల ను వెంటనే రెగ్యులైజేషన్ కు కావలసిన చర్యలను చేపట్టాలని అనేకమార్లు ముఖ్యమంత్రిని వివిధ రాష్ట్ర ,జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఓదాక్కినంక ఓడ మల్లయ్య ఓడ దిగినాక బోడి మల్లయ్య లాగా పరిస్థితి ఉందని అన్నారు. న్యాయమైన పోరాటా నికి వీరు చేస్తున్న పోరాటానికి కె వి పి ఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మెలుగు రి కృష్ణ, ప్రధాన కార్యదర్శి బొమ్మగా ని రాజు, వివిధ కేటగిరి ల ఉద్యోగు లు పాల్గొన్నారు.