ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో దళితులకు ఇచ్చిన వాగ్దానం దళిత బంధు అంబేద్కర్ అభయహస్తం స్కీమును 12 లక్షల గా నిర్ణయించి ఇస్తామన్న వాగ్దా నాన్ని వెంటనే అమలు చేయాలని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు ఈరోజు నకిరేకల్ పట్టణ కేంద్రంలోని నర రాఘవరెడ్డి భవ నంలో పత్రికా విలేకరుల సమావే శంలో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడు తూ గత ప్రభుత్వం దళితులకు ఇచ్చిన వాగ్దానం దళిత బంధు కొనసాగిస్తామని వాగ్దాన భంగానికి పాల్పడిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయస్తం పేరా 12 లక్షలు ఇస్తామనే వాగ్దానాన్ని నేటికి ఎక్కడా అమలుపరచలేదని తెలిపారు.
వెంటనే ప్రభుత్వం అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. నేటికీ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు ప్రకటించలేదని కనీసం అర్హుల జాబితా ఎంపికకు కూడా ప్రయత్నం చేయడం లేదని అన్నారు ప్రభుత్వం అమలు చేయని పక్షంలో జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన దళితులను ఏకం చేసి దళిత బంధు కోసం ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.మరియు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలయ్య స్కీములను పూర్తిగా రద్దు చేశారని వెంటనే యాక్షన్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కులాంతర వివాహితులకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని మూడు సంవత్సరాలుగా ఇవ్వడం లేదని వెంటనే ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇండస్ట్రియల్ ద్వారా అమలయ్యే స్కీముకు గత నాలుగు సంవత్సరాలుగా సబ్సిడీ పడడం లేదని అన్నారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు కావడం లేదని పేరుకే పథకాలు కొనసాగిస్తామని ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఒంటెపాక కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు వెంకన్న నాయకులు జమదగ్ని బొజ రాములు తదితరులు పాల్గొన్నారు.