ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గ్రామపంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు రాక అర్థాకళితో అలమటిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికుల వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జు న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జేఏసీ డిసెంబర్ 27 28 తేదీల్లో టోకెన్ సమ్మె పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి నల్లగొండ మండలం ఎమ్మార్వో కార్యాలయం ముందు సమ్మె నిర్వహించారు. గ్రామపంచా యతీ కార్మికుల సమస్యల పరిష్కా రానికి నిర్వహిస్తున్న ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొన్న ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులు ఉదయాన్నే నాలుగు గంటలకు లేసి పనిగంటలతో నిమిత్తం లేకుం డా రాత్రి వరకు పనిచేస్తూ అత్య ధిక శ్రమదోపిడికి గురవుతున్న వర్గం గ్రామపంచాయతీ కార్మికులని అలాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చేదే అతి తక్కువ వేతనం ఈ వేతనం నెలల తరబడి పెండింగ్లో ఉండడం వలన కార్మికు లు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలోని ప్రజలను రోగాల బారిన పడకుండా ఉండడానికి అనేక రకాల పనులు నిర్వహిస్తూ గ్రామాన్ని సర్వాంగ సుందరంగా ఉంచడంలో అవా ర్డులు తీసుకురావడంలో గ్రామ పంచాయతీ కార్మికుల కృషి ఎంతో అమోఘం అని కొనియాడారు. గ్రామ పంచాయతీలలో పనిచేస్తు న్న సిబ్బంది అత్యధికులు దళిత బహుజనులేనని అన్నారు .గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో కార్మికులు 34 రోజులు సమ్మె చేసి న సమయంలో కాంగ్రెస్ నాయకు లు సమ్మె శిబిరాలను సందర్శించి గ్రామపంచాయతీ కార్మికులు అత్యధిక శ్రమ దోపిడికి గురవు తున్నారని కాంగ్రెస్కు ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి రాగానే గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని పేస్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి సంవత్సర కాలం పూర్తయినప్ప టికిని పిల్లి చస్తే గోడౌతల పడేసిన చందంగా కార్మికుల పట్ల ప్రభుత్వ తీరు ఉన్నదని అన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయా లని అన్నారు.
యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలే సత్య నారాయణ మాట్లాడుతూ కార్మి కులందరినీ పర్మినెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ గా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలలో గ్రామ పంచాయతీ కార్మికులు అందర్నీ పర్మినెంట్ చేయాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు ఈ టోకెన్ సమ్మెతో పరిష్కరించకపో యినట్ల యితే రాబోయే రోజులలో నిరవధి క సమ్మెలోకి వెళ్లడానికి కార్మికులు వెనకాడబోరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్ యూనియన్ జిల్లా సోషల్ మీడియా బాధ్యులు ఇరిగి ఎల్లేష్, మండల నాయకులు దున్న అనిల్ కుమార్, బక్కతోళ్ళ రేణుక, పోలే నాగమణి, బోగరి సైదులు, కుడతాల లింగమ్మ, మేకల నరసింహ, పెరిక రాంబాబు, కళావతి, సమీనా, గోరిబి, కాష్మల్ల రవి, శ్రీను, కట్ట నరసింహ, లక్ష్మయ్య, శ్రీకాంత్, వెంకటయ్య, కళ్యాణి, జయమ్మ, భాగ్యమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.