–జనాభా ప్రకారంగా నిధులు కేటాయించాలి
–ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి
–కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున
Paladugu Nagarjuna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:కేంద్ర బిజెపి ప్రభుత్వం 2024 25 బడ్జెట్లో దళితుల గిరిజనుల (Dalit tribes)జనాభా ప్రాతిపదికన బడ్జెట్ నిధులు కేటాయించాలని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ భాస్కర్ టాకీస్ వద్దగల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఇటీవల సమర్పించిన బడ్జెట్ మరియు 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో దళిత సమాజాన్ని పూర్తిగా విస్మరించాయని, ఇది భారత రాజ్యాంగానికి స్పష్టమైన ఉల్లంఘనను ప్రతిబింబిస్తుందని తెలిపారు. సామాజిక అభివృద్ధికి, దళిత సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తగిన బడ్జెట్‌ను కేటాయించడం లేదని అన్నారు. గత దశాబ్ద కాలంగా బీజేపీ హయాంలో షెడ్యూల్డ్ కులాల బడ్జెట్ ఖర్చులు తగ్గుముఖం పట్టాయని జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు జరగలేదని. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నీతి అయోగ్ సిఫార్సులు మరియు ఎస్సిల జనాభా ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు రావాల్సిన కేటాయింపులు దాదాపు 16.2 శాతం ఉన్నాయని కానీ పైన పేర్కొన్న షెడ్యూల్డ్ కులాల కోసం అంచనా వేసిన కేటాయింపులు గత 10 సంవత్సరాల బడ్జెట్ అంచనాలలో బడ్జెట్‌లో (budget) 11 శాతం దాటలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
షెడ్యూల్డ్ కులాలకు (Scheduled Castes) కేటాయింపులు కేవలం అంకెలే కానీ సంక్షేమానికి సరిపడా స్కీమ్‌లకు సరిపడా బడ్జెట్‌తో అందించడం లేదని విమర్శించారు. దీనికి ప్రతిగా, భారతదేశం అంతటా దళిత హక్కుల కోసం వాదించే సంస్థలు దేశవ్యాప్త నిరసనను నిర్వహిస్తున్నాయని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలను పెంచాలని, షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్ ఎస్‌సిఎస్‌పి ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని, ప్రయివేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరసన ప్రధాన డిమాండ్లు షెడ్యూల్డ్ కులాలను సామాజిక అభివృద్ధిలోకి తీసుకురావడానికి బడ్జెట్‌లో కేటాయింపులను సమీక్షించండి. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను (Privatization of public sector)ఆపండి మరియు బ్యాక్‌లాగ్ పోస్ట్‌లను పూరించండి. తక్షణమే దళితులకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టలాన్నారు. షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes)అభివృద్ధికి నిధుల కేటాయింపు మరియు వినియోగాన్ని నిర్ధారించడానికి జాతీయ స్థాయిలో సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయలి. విద్యా, ఉపాధి మరియు పారిశ్రామిక రంగాలలో షెడ్యూల్డ్ కులాల వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి తగిన వనరులను అందించడం మరియు సాధికారత అవసరం. ప్రమోషన్లలో రిజర్వేషన్ల రాజ్యాంగ రక్షణను అనుసరించండి దళితులపై అఘాయిత్యాలు జరగకుండా నిరోధించడానికి ఎస్సీ ఎస్టీ, పి ఓ ఏ చట్టాన్ని స్ఫూర్తిగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి బిక్షమయ్య ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివ కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సభ్యులు రెమిడాల పరుష రాములు డాక్టర్ తోట నరసింహ కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ బొట్టు శివకుమార్ బొల్లు రవీందర్ జిల్లా కమిటీ సభ్యులు బొంగరాల వెంకులు నాయకులు కొండా వెంకన్న పోలే సత్యనారాయణ సైదులు మారన్న నరసింహ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.