ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మనువాదులు నిమ్న జాతులకు రక్షణ కల్పించే భారత రాజ్యాంగన్ని నిర్వీర్యం చేసే కుట్రలనుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు నల్గొండ లోని స్థానిక భాస్కర్ టాకీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికీ పూలమాలంకరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతు స్వాత్రంత్రo వచ్చి 76 ఏండ్లు దాటినా నేటికీ రాజ్యంగా ఫలాలు దళిత గిరిజిన నిమ్న జాతులకు అందలేదని అన్నారు.
ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేసిందని రిజర్వేషన్ లేకుండా చేసిందని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించుటకు ఉద్యమాలు చేయాలన్నారు. దళితులపైన దాడులు అత్యాచారాలు పెరిగి పోయాయాని ఆవేదనా వ్యక్తం చేశారు.సామజిక ఉద్యమాలలో ప్రజలు ప్రజాతంత్ర వదులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో kvps జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్ నాయకులు పోలె సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.