ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధుల (Seasonal diseases) బారిన ప్రజలు పడి తీవ్ర అనారోగ్యం పాలై లక్షల రూపాయలు ఖర్చు పెడు తున్నారని ప్రభుత్వ దావకానలో మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున (Paladugu Nagarjuna) అన్నారు. రాత్రి అనంతరం గ్రామంలో ఉదయం జీకే అన్నారం గ్రామాల్లో సిపిఎం శాఖా మహాసభలు జరిగినవి ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాలు ముందుచూపుతో వివరించాలని తెలిపారు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి జబ్బుల బారిన పడి ప్రైవేటు దవాఖానాలలో లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. పరిశుభ్రత పారిశుద్ధ్యం పనులను నిధులు కేటాయించి గ్రామాలలో మురికి కాలువలు చెట్లు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు కొత్తపాలెం నుండి అనంతరం వరకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు మూసుకొని ప్రజలు ప్రయాణించే పరిస్థితి లేదన్నారు.
మురికి కాలువలు తీసే పరిస్థితి లేదన్నారు జీకే అన్నారం గ్రామంలో మురుగు కాలువలు తీయక పూడిపోయి దోమలు (Mosquitoes) ఈగలతో కంపు కొడుతున్నాయని తెలిపారు గ్రామాలలో వృత్తిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేయుటకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని తెలియజేశారు నేటి వరకు ఒక్క సంక్షేమ పథకం అమలు కోసం ప్రయత్నం చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మహాసభలలో సిపిఎం జిల్లా కమిటీ (CPM District Committee) సభ్యురాలు కొండ అనురాధ సిపిఎం మండల కార్యదర్శి నలుపురాజు సైదులు మండల కమిటీ సభ్యులు కొండా వెంకన్న మానుపాటి ఎల్లయ్య రుద్రాక్ష రాములు నాంచారమ్మ కొండ అంజయ్య కొండ రాములు తండు శంకర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.అనంతారం నూతన గ్రామ కార్యదర్శిగా రుద్రాక్షి రాములు జీకే అన్నారం గ్రామ కార్యదర్శిగా తండు శంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.