Paladugu Nagarjuna: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రమణయ్య ఆశయా సాధన కోసం కృషి చేయాలని రమణయ్య మృతి సిపిఎం పార్టీకి తీరనిలోటని సిపి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు పాలడుగు నాగార్జున (Paladugu Nagarjuna) జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమ ణారెడ్డి అన్నారు. ఆదివారం గంగ న్నపాలెం గ్రామంలో కామ్రేడ్ గంటేకంపు రమణయ్య సంతాప సభ సిపిఎం తిప్పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్ర మంలో నాగార్జున రమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రమణయ్య పేద ప్రజల కోసం దున్నేవాడికి భూమి కావాలని పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం అనునిత్యం పోరాడిన వ్యక్తిని అన్నారు.
రమణ అన్న ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఉపాధి (Education Medical Employment) కల్పించాలని పాలకుల మీద అనేక పోరాటాలు చెయడం జరిగిందని రమణ అన్న ఏదైతే పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ పోరాటాన్ని మనందరం తన ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అందరు సమానమని సమాన హక్కుల కోసం పోరాడిన రమణన్న మన మధ్య లేకపోవడం విచారకరమని అన్నారు మండలంలో అనేక పోరాటాలు ముందుండి నడిపిన రామన్న లేకపోవడం సిపిఎం పార్టీకి రమనన్న కుటుంబానికి తీరనిలోటని అన్నారు సంతాప సభానంతరం గంటేకంపు రమణయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది *సిపిఎం మండల కార్యదర్శి మన్నెం బిక్షం అధ్యక్షతన జరిగిన సంతాప సభలో సిఐటియు మండల కన్వీనర్ భీమగని గణేష్ (Bheemagani Ganesh)వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గండమళ్ళ రాములు రమణయ్య తమ్ముడు గంటకంపు శ్రీను సిపిఎం నాయకులు పుల్లెంల శ్రీకార్ జంజరాల సైదులు గాదె నర్సింహ బోల్లు రవిందర్ బోట్లు శివ కుమార్ పాపయ్య వెణు రామకృష్ణ రవి చంద్రకళ లింగయ్య సైదులు శివ వెంకటయ్య ఈస్తారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు