ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభు త్వం మానవ హక్కుల తో పాటు మహిళలకు ప్రత్యేకమైన హక్కుల ను కల్పిస్తున్నారు కానీ వాటికి రక్షణ కల్పించడంలో విఫలమవు తున్నాయని, హక్కులు హరించ బడితే సమాజం ప్రమాదంలో పడుతుందని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.
మంగళవారం డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నల్లగొండ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో మానవహరాన్ని నిర్వహించి హక్కుల పట్ల వారికి అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితిలో మానవ హక్కుల పై నిరంతరం చర్చలు జరుపుతూ మానవ జీవన వికాసానికి కావలసిన అనేక నూతన హక్కులను అందిస్తుంది. కానీ రోజురోజుకు జీవించే హక్కు ప్రమాదంలో పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.మోడీ ప్రభుత్వం నిరంతరం హక్కులను హరించి వేస్తుందని వారన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ పాలకులు పుంకాను పుంకాలుగా ప్రసంగాలు ఇస్తారు కానీ తమ దేశంలో మహిళపై జరుగుతున్న ఆకృత్యాలపై గాని,దళితులపై జరుగుతున్న దాడుల పై గాని ఏనాడు స్పందించరని,ఉత్తర భారత దేశంలో మహిళపై అత్యాచారాలు తీవ్రమయ్యాయని వీటిపైన మోడీ ప్రభుత్వం ఏనాడు నోరు మెదుపదని వారన్నారు.
దేశంలో రోజురోజుకు కులోన్మాధ హత్యలు, మహిళపై అత్యాచారాలు తీవ్రమయ్యాయని రోజురోజుకు మహిళ పట్ల క్రైమ్ రేటు పెరిగిపోతుందని అందుకు నిదర్శనం జాతీయస్థాయి క్రైం నివేదికే నిదర్శనం అన్నారు. ఆదివాసి గిరిజన మహిళలపై ఆకృత్యాలు ఎక్కువ అయ్యాయని వారి పట్ల ప్రభుత్వాలు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలని కోరారు. పార్లమెంటులో మహిళ కోసం పదుల చట్టాలు రూపొందించారు గాని ఆచరణలో అమలు కావడం లేదని వారు అన్నారు. భారత రాజ్యాంగం హక్కుల విషయంలో ఎలాంటి కులమత లింగ వివక్షత పాటించరాదని చెబుతున్నా మహిళలు హక్కులను పొందే విషయంలో తీవ్రమైన వివక్షతలకు గురవుతున్నారని ఆమె అన్నారు.దేశం నలుమూలల రోజుకు పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్న నిరోధించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు.
అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు మంత్రులు నేరస్తులకు రక్షణ కల్పిస్తూ మహిళల పట్ల వివక్షత చూపుతున్నారని వారన్నారు.ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా అనురాదా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి కారంపూడి ధనలక్ష్మి చెనబోయిన నాగమణి పాదురు గోవర్ధన మేకల వర్ణ ఎండీ సుల్తానా జిల్లా కమిటీ సభ్యులు కానుకుంట్ల ఉమారాని కౌసల్య శశికళ జంజిరాల ఉమా రామలింగమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.