Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paladugu Prabavathi: ప్రతి మహిళకు రూ. 2500 ఇవ్వాలి

Paladugu Prabavathi: ప్రజా దీవెన, తిప్పర్తి:
కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ ఎన్నికల సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానన్న హా మీని నిలబెట్టుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి(Paladugu Prabavathi)డిమాండ్ చేశారు. గురు వారం తిప్పర్తి మండల కేంద్రంలో నర రాఘవరెడ్డి భవన్ లో(Raghava reddy bhavan)ఐద్వా నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం మండల మహాసభలు నిర్వహించ డం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో(mahalakshmi scheme)భాగంగా మహిళలకు ఆర్టీసి ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్(gas cylinder )సబ్సిడీని అమలు చేయడాన్ని స్వాగతిస్తూనే ఆ పథకంలో భాగమైన ప్రతి మహిళకు 2500 రూపాయల నగదును అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా నేటికీ అమలు చేయలేదు. వేగవంతంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కార్యచరణ ప్రకటించాలని డిమాండ్ (demand)చేశారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల విష జ్వరాలు వేగవంతంగా విస్తరిస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని(health emergency)ప్రకటించి చికెన్ గునియా, డెంగ్యూ లాంటి వ్యాధులకు అన్ని ప్రైవేటు దావకానాల్లో ఉచిత వైద్యం (free treatment )అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రైవేటు దావకానాలు దోపిడీ విష జ్వరాల పేరుతో విపరీతంగా దోపిడీ పెరిగిపోయిందని,అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు అన్నారు.ప్రభుత్వ దావకానాలో తీవ్రమైన బెడ్స్(beds) కొరత ఉందని విష జ్వరాలపై రోజురోజుకు సమీక్ష సమావేశాలు నిర్వహించి నివారణకు కృషి చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్ లో కనీసం కూడా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి పట్టించుకోవడంలేదని వారన్నారు. కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.హాస్టల్స్ లో(hostal )రోజువారీగా వైద్యులు పరీక్షలు నిర్వహించాలన్నారు.

అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది *ఐద్వా మండల అధ్యక్షకార్యదర్శిగా బోల్లం వసంత జంజీరాల ఉమా ఉపాధ్యక్షులు మంత్రాల మంగమ్మ మాలే భార్గవి సహాయ కార్యదర్శి సైదమ్మ పోకల ఝాన్సీ కోశాధికారిగా భీమగాని విజయలక్ష్మి మరియు 13 మంది కమిటీ సభ్యులతో మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జ్యోతి సైదమ్మ లక్ష్మి ఎల్లమ్మ జానమ్మ అనిత ఈరమ్మ పద్మా వసంత తదితరులు పాల్గొన్నారు.