ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా లో బస్సు ల సంఖ్య పెంచాలి ప్రతి గ్రామానికి బస్సు నడపాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ ఆర్టీసీడీఎం కు వినతి పత్రం సమర్పించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ బస్టాండులో సంతకాల సేకరణ చేస్తూ ప్రభావతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు స్వాగతిస్తున్నాం. అలాగే జిల్లా లోని ప్రతి గ్రామాల్లోకి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు గర్భవతిలు స్త్రీలు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారూ. ముఖ్యంగా మునుగోడు ప్రాంతాల్లో బస్ ప్రయాణం అసౌకర్యంగా ఉందని మరియు నల్గొండ to వయా తాటికల్ బస్సు నడపాలని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు వెంటనే నూతన బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలెబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా అనురాధ, జిట్ట సరోజ ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి
భూతం అరుణకుమారి ఎస్కే సుల్తానా జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల ఉమారాణి జంజీరాల ఉమా తదితరులు పాల్గొన్నారు.