–మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి
–ఫాస్ట్ ట్రాక్కోర్టు ద్వారా 30 రోజు లలో నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలి
–ఐద్వ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్
Paladugu Prabhavati: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రపంచం నివ్వరపోయేలా ప్రాణాలు పోసి కాపాడే యువ డాక్టర్ పైన అత్యంత దుర్మార్గంగా సామూహిక అత్యాచారం (Gang rape) జరిపి హత్య (murder)చేయ డాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షురాలు పాలడుగు ప్రభావతి (Paladugu Prabhavati)తీవ్రం గా ఖండించారు. ఆదివారం రోజున ఐద్వా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శ న చేయడం జరిగింది. ఈ సందర్భం గా ప్రభావతి (Paladugu Prabhavati)మాట్లాడుతూ నిందితు లను కఠినంగా శిక్షించాలని, ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించి 30 రోజులలో నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న పరిణామాలను కంట్రోల్ చేయడంలో విఫలం చెందారని అన్నారు. డాక్టర్లు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై మూకుమ్మడి దాడి చేసి చంపడానికి ప్రయత్నించి టెంటు పగలగొట్టి ఫ్యాన్ లు విరిచి భయభ్రాంతులకు గురిచేస్తున్న పోలీసులు (police)ఏం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. డ్రగ్స్ (drugs)మాఫియా ముఠాలను అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వాటిని అణిచివేసి నిర్మూలించే దాంట్లో విఫలం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఫోర్సును (Special Force) ఉపయోగించి అలాంటి మూటలను అరికట్టాలని తెలిపారు. ఒక నిర్భయ ఒక అత్రాస్ ఒక మౌనిత ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని చూడాలని అన్నారు. 77 ఏళ్ల స్వాతంత్రం ఒకపక్క జరుగుతున్న మహిళలు అత్యంత ధరుణంగా చంపారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ జట్టా సరోజ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ సహాయ కార్యదర్శి భూతమారుణ పాదూరి గోవర్ధన లీగల్ సెల్ కన్వీనర్ మేకల వర్ణ బొల్లేపల్లి మంజుల జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమారాణి పుష్ప మరియు తదితరులు పాల్గొన్నారు.