Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Palakuri Ravi Gaud: జమిలి విధానం దేశాభివృద్ధికి దోహదo

Palakuri Ravi Gaud: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind)గారి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఏకకాల ఎన్నికలకు సంబం ధించి సమర్పించిన ఒక దేశం-ఒక ఎన్నికల సిఫార్సులను తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చ అధి కార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ (Palakuri Ravi Gaud) స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ (Central Cabinet)సిఫారసులను ఆమోదిం చడం దేశానికి గర్వకారణమని, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సమయం ఆసన్నమైం దని రవిగౌడ్ ( Ravi Gaud)అన్నారు.దేశంలో 1951 మరియు 1967లో ఒకేసారి ఎన్నికలు జరిగాయని గుర్తు చేశా రు. ఒకే జాతీయ, ఒకే ఎన్నికల విధానం వల్ల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, అభివృద్ధి కోసం ఖజానాపై అదనపు భారం పడకుండా, మోడీ ప్రభుత్వo తీసు కున్న మంచి పనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని రవిగౌ డ్ కోరారు.