Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Palakuri Ravi Gaud: ఉజ్జ్వల‌ భ‌విష్య‌త్ దిశ‌గా కేంద్ర బడ్జెట్

Palakuri Ravi Gaud:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎన్‌డిఎ (NDA) నేతృత్వంలోని కేంద్ర బడ్జెట్‌ (Central Budget)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఏడవసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశ ఉజ్వల భవిష్యత్తు కు సూచికగా నిలుస్తుందని బీజేపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ (Palakuri Ravi Gaud)పేర్కొన్నారు. సoస్కరణల కు అనుకూలంగా, ప్రజలకు స్నేహ పూర్వకంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పాటునందించే విధంగా ఉందని ఆయన అన్నారు. గ్రామీణాభివృద్ధి, రైతులు, మహి ళలు మరియు యువత వృద్ధికి తగిన కేటాయింపులతో భారత ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపనలకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు.