Palakuri Ravi Goud: ఇందిరమ్మ కమిటీ సభ్యుల ప్రలోభాలకు లోంగి లబ్దిదారులు మోసపోవద్దు : పాలకూరి రవి గౌడ్
ప్రజా దీవెన, నల్గొండ టౌన్: *తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రామ సభల ద్వారనే ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక జరుగుతుంది అని,లబ్దిదారులను ఎంపిక చేసే అధికారం ఇందిరమ్మ కమిటీలకు లేదు అని, లబ్ధిదారులు ఇందిరమ్మ కమిటీ సభ్యుల ప్రలోభాలకు లొంగి మోసపోవద్దని బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ కోరారు..
యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు “డబుల్ బెడ్ రూం ఇళ్ళ లేదా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేసేది మేమే”, అని అమాయక పేద ప్రజలను మభ్యపెట్టి, మాములు వసులు చేసే పర్వం జరిగే అవకాశం ఉంది. నిజానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ది దారుల ఎంపిక చేసే అధికారం ఏ మాత్రం ఇందిరమ్మ కమీటిలకు లేదు ,ఈ కమీటిలకు ఏలాంటి చట్టబద్దత లేదు.ఇందిరమ్మ కమీటిలపై బిజెపి శాసనసభపక్ష నేత గౌ,, శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కు చెప్పిన మాటలు…. ఇందిరమ్మ ఇళ్ల లబ్ది దారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ఏలాంటి అధికారాలు ఇవ్వలేదు అని చెప్పటం జరిగింది.దినిపై తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరిస్తూ…. ఇందిరమ్మ ఇళ్ల లబ్ది దారులను, గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారనే లబ్ది దారులను ఎంపిక చేయాలని తీర్పు చెప్పటం జరిగింది.
కావున యావత్ తెలంగాణ ప్రజలు మరియు అన్ని అర్హతలు ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల మాటలు నమ్మి అర్దికంగా నష్ట పోవద్దు, మోసపోవద్దు అని మనవి. అన్ని అర్హతలు ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో అవకతోకలకు జరిగితే ..మీ పక్షాన పోరాటం చేయటానికి ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ ఉంటుందని రవిగౌడ్ తెలిపారు..