Polling: పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి
ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా లేకుండా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ అన్నారు.
మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ
ప్రజా దీవెన నల్లగొండ: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా లేకుండా(Parliament Elections) పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించాలని(Central Election Commission) కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పిఓ,పిఓలకు ఇస్తున్న రెండో విడత శిక్షణ తరగతులను ఆకస్మికంగా తనిఖీ చేసి వారితో ముఖాముఖి మాట్లాడారు.
టెండర్ ఓటు, చాలెంజ్ ఓట్లు, పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడే వారు, పోలింగ్ రోజున ఈవీఎం(EVM) ప్రారంభించే సమయము, మే 13 న నిర్వహిస్తున్న పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం పెంచిన విషయం,తదితర అన్ని వివరాలను అడుగగా, శిక్షణకు హాజరైన పిఓ,ఏపిఓలు సమాధానాలను ఇచ్చారు.
పోలింగ్ (Polling)రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పొరపాట్లకు తావివ్వకుండా పోలింగ్ నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, ట్రైనింగ్ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్ తదితరులు ఉన్నారు.
Parliament Elections conducted without mistakes