Perika Anjaiah: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ (Congress Party SC Cell)జిల్లా అధికా ర ప్రతినిధిగా కనగల్ మండలం తిమ్మాజిగూడం కు చెందిన పెరిక అంజయ్యను నియమించారు. గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)క్యాంపు కార్యాలయం లో డిసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (Gummula Mohan Reddy, Municipal Chairman Burri Srinivas Reddy) చేతుల మీదుగా నియామక పత్రం అందుకు న్నారు. ఈ సందర్భంగా పెరిక అంజ య్య మాట్లాడుతూ ఎస్సీ సెల్ పటి ష్టత కోసం తన వంతు కృషి చేస్తా నని తెలిపారు. తన నియమకానికి కృషి చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు నగారి గారి ప్రీతం, జిల్లా అధ్యక్షుడు బోడ స్వామీలకు ఈ సందర్భంగా కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్య క్రమంలో మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఏర్పుల రవి, పెరిక హరి ప్రసాద్, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.