ప్రజా దీవెన ,నల్గొండ టౌన్:బీజేపీ సంస్థగత ఎన్నికలలో భాగంగా నల్లగొండ పట్టణంలోని 08వ వార్డు అక్కలయిగూడెం లోని బిజెపి నాయకులు పిల్లి రామరాజు యాదవ్ క్యాంప్ కార్యాలయంలో నూతన బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో 08,09 వార్డులకు సంబంధించిన బూత్ సీనియర్ నాయకులు, సాధారణ సభ్యుల సమక్షంలో 72,73,74,95,96,102,45 బూత్ కమిటీ నిర్వహించారు ఈ బూత్ కమిటీలో ఏకగ్రీవంగా బూత్ అధ్యక్షులుగా బోద వంశి,కన్నెబోయిన శంకర్, బోడిగ భరత్ , సింగం నరేందర్ ను ఎన్నుకున్నారు..
ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ *మాట్లాడుతూ.*
ప్రతి బీజేపీ కార్యకర్త ఒక లక్ష్యంతో ముందుకుసాగాలి అని అన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ కోటపై బీజేపీ జెండా ఎగరవేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహా సభ్యత్వ ప్రముఖ గోలి మధుసూదన్ రెడ్డి,బీజేపి నాయకులు పోతేపాక సాంబయ్య,నాయకులు మిర్యాల వెంకటేశం, లగడపురం వెంకన్న, ముంత సైదులు,రేఖ నాగబాబు చిన్నాల ఆంజనేయులు, మేకల రవి ,బుచ్చల నాగరాజుగౌడ్ , పిల్లి కోటేష్ తదితరులు పాల్గొన్నారు..