Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Police Act:జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ఏప్రిల్ 1 నుండి 30 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా యస్.పి చందనా దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ముందస్తు అనుమతి లేనిదే సమావేశాలు నిషేధం

జిల్లా యస్.పి. చందనా దీప్తి

ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ఏప్రిల్ 1 నుండి 30 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా యస్.పి చందనా దీప్తి(S.P.Chandana Deepti) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున పోలీసు(Police) అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు,(Public meeting)సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజా ధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు.

జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Police Act was implemented district month