–రోడ్లమీద వాహనాలను పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవు
–ప్రకాశం బజార్ వ్యాపారస్తులతో ట్రాఫిక్ పై వన్ టౌన్ పోలీస్ అవగాహన సదస్సు
Police Awareness Conference: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ (SP Saratchandra Power) ఆదేశానుసారం ప్రకాశం బజార్లో వన్ టౌన్ పోలీస్ లు ట్రాఫిక్ సమస్యలు మరియు సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల అవగాహన సదస్సు (Police Awareness Conference) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాపు యజమానులతో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి (Inspector Rajasekhar Reddy) మాట్లాడు తూ నిత్యం రద్దీగా ఉండే ప్రకాశం బజార్ షాప్ యజమానులు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు, చిన్నచిన్న వర్తక యజమానులు ప్రతి ఒక్కరు బాధ్యతగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, రోడ్లమీద వాహనాలు ఇష్టం వచ్చినట్లు నిలబెట్టడం వల్ల అత్య వసర సమయంలో ఈ మార్గం నుండి వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తుతు న్నాయని, పబ్లిక్ నుండి ఫిర్యాదులు రావడంతో ఈ కార్యక్ర మం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఇకనుండి ప్రతి ఒక్కరు తమ షాపుల ముందు పార్కింగ్ లైస్ ను వైట్ పెయింట్తో వేసుకుని పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ లైన్ (Parking line) దాటి రోడ్డుపై పార్కింగ్ చేయించరాదని, వాహనాలను వరుస క్రమంలో పెట్టుకోవడం వలన తక్కువ స్థలంలోనే ఎక్కువ పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు.
అలాగే ఫోర్ వీలర్స్ వాహనాలను కేటాయించిన ఓల్డ్ కలెక్టరేట్, వెజిటబుల్ మార్కెట్ బ్యాక్ (Old Collectorate, Vegetable Market Back Sy) సైడ్ పార్కింగ్ స్థలంలోనే పార్కింగ్ చేయాలని సూచించారు. ఇకనుండి ఇష్టానుసారం షాపు ముందర వాహ నాలను పార్కింగ్ చేసి ట్రాఫిక్కు అంతరాయం కలి గిస్తే, వాహ నదారుల పైన షాప్ యజమాని పైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పట్టణంలో ఇటీవల దొంగతనాలు ఎక్కువ అవుతున్నందున, ప్రతి ఒక్క షాపు యజమాని బాధ్యతగా సీసీ కెమెరాలు (cc cemers) ఏర్పాటు చేసుకొని, రెండు కెమెరాలు రోడ్డు కవర్ అయ్యే విధంగా చూసుకోవాలని, నేర రహిత పట్టణంగా తీర్చి దిద్దడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వర్తక వ్యాపారులతో పాటు వన్ టౌన్ ఎస్సై శంకర్, ఎచ్ సీ సుదర్శన్, పిసీలు పారుఖ్, మధుసూదన్ రెడ్డి, మురళి, శ్రీకాంత్, సైదులు తదితరులు పాల్గొన్నారు.