Polling: ఎన్నికలకు పోలీస్ అధికారులు సిద్ధంగా ఉండాలి
పార్లమెంట్ ఎన్నికలకు పోలీస్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి సూచించారు.పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో ఫ్రీ అండ్ ఫేర్ నిర్వహణే లక్ష్యంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కేంద్రం బలగాల అధికారులు, జిల్లా పోలీసు అధికారులు ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు, ఆయా విధులలో ఉన్న పోలీస్ అధికారుల బాధ్యతలు,చేపట్టవలసిన చర్యలపై గురువారం సమీక్షించారు.
ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా జిల్లా పోలీస్
జిల్లా ఎస్పి చందనా దీప్తి
ప్రజా దీవెన నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికలకు(Parliament elections) పోలీస్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి సూచించారు.పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో ఫ్రీ అండ్ ఫేర్ నిర్వహణే లక్ష్యంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కేంద్రం బలగాల అధికారులు, జిల్లా పోలీసు అధికారులు ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు, ఆయా విధులలో ఉన్న పోలీస్ అధికారుల బాధ్యతలు,చేపట్టవలసిన చర్యలపై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 13 న జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్(Parliament elections) సందర్భంగా పోలీసు అధికారులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు.
ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్స్ సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు, పోలింగ్ కేంద్రాల దగ్గరా పాటించాల్సిన నియమాలను తెలియజేశారు. పోలీస్ అధికారులు ఎలక్షన్(Elections) సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల లోపల ఎవ్వరినీ రానివ్వకూడదని ఓటు హక్కు వినియోగించుకోనే వారు పోలింగ్ కేంద్రాల కు ఎట్టి పరిస్థితిలో సెల్ ఫోన్లు, ఇతర హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని అన్నారు.
రూట్ మొబైల్ అధికారులు డి ఆర్ సి సెంటర్ నుండి ఈవీఎం(EVMs) లు తీసుకున్న అప్పటి నుండి పోలింగ్ స్టేషన్ కు వెళ్ళే వరకు, పోలింగ్ అనంతరం తిరిగి డిఆర్సి సెంటర్ కు చేరేవరకు ఎట్టి పరిస్తితులల్లోనూ ఈవీఎం లను వదిలి వెళ్లరాదన్నారు.ఏదైనా సమస్య వస్తె వెంటనే సంబంధిత అధికారులు సమాచారం అందించాలని అన్నారు. ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొబైల్ రూట్ లలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే క్షణాలలో రూట్ మొబైల్(Mobile teams) టీమ్ లు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరించగలగాలని అందుకు లోకల్ ఎస్సై, రూట్ మొబైల్ ఇంచార్జి అధికారి కమ్యూనికేషన్ లో ఉంటూ కో ఆర్డినేషన్ చేసుకోవాలని తెలియజేశారు.
అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిదిలో ఉన్న మొబైల్ రూట్ లను, వాటి పరిధిలో కి వచ్చే గ్రామాలు, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వివరాలను, ఆక్కడ నియమించిన పోలీస్ అధికారుల వివరాలను పరిశీలించి ఆయా రూట్ లలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్ .హెచ్.ఓ, మొబైల్ రూట్ ఇంచార్జి లు, సంబంధిత రూట్ అధికారుల మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉంచుకోవాలని, ఏదైనా సమస్య వస్తె వెంటనే సమాచారం అందించాలని అన్నారు.ఈ సమావేశంలో ఐఆర్బిఎన్ కమాండెంట్ పెమ్ తుండిక్,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ బి. రాములు నాయక్,అడిషనల్ ఎస్పీ డిటీసీ రమేష్,యస్.బి డిఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పీ శివ రామ్ రెడ్డి, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మి నారాయణ,సిఐలు, ఎస్సై లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Police ready Election polling