Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Group-1 Prelims exam: గ్రూప్-1 పరీక్షకు పటిష్ట పోలీసు బందోబస్తు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.జి.పి.యస్.సి.) నిర్వహిస్తున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు పోలీ సు శాఖ తరపున్న అన్నిరకాల భద్ర త పరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పి చందనా దీప్తి తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 47 సెంటర్లలో పరీక్ష రాయనున్న 16899 మంది అభ్యర్ధులు
ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి

ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.జి.పి.యస్.సి.) నిర్వహిస్తున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు పోలీ సు శాఖ తరపున్న అన్నిరకాల భద్ర త పరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పి చందనా దీప్తి(SP Chandana Deepti)తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల లో మొత్తం 16899 మంది అభ్యర్ధు లు పరీక్ష రాయనున్నారని, పరీక్షకు వచ్చే అభ్యర్ధులకు ఎలాంటి అసౌ కర్యం కలుగకుండా, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటు oదని, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతా లలో సభలు, ఊరేగింపులు, ర్యాలీ లు లాంటివి నిర్వహించ కూడదని, అనవసరంగా గుంపులు గుంపు లుగా ఎవ్వరూ కూడా పరీక్ష కేంద్రం పరిసరాలలో తిరగటానికి అను మతి లేదన్నారు. పరీక్షా కేంద్రం(Examination Center)పరి సర ప్రాంతాల్లో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని షాపు యజమానులకు సూచించారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అటెం డెన్స్ తీసుకోవడం జరుగుతుందని, అభ్యర్ధులు బయోమెట్రిక్(Biometric), వెరీఫికేష న్ సిబ్బందికి సహకరించవలసింది గా సూచించారు.

అభ్యర్ధులకు సూచనలు:-

పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రం లోనికి అనుమతి ఇస్తారని, 10 గంటలకు పరీక్షా కేంద్రం గెట్ మూసి వేయడం జరుగుతుందని, 10 గం టల తర్వాత ఒక నిమిషం ఆలస్యం గా వచ్చిన ఎవ్వరిని లోపలికి అను మతించడం జరగదు.
ఎగ్జామ్ కు వచ్చిన అభ్యర్థులు హాల్ టికెట్(Hall Ticket)నందున్న నియమని బంధనాలు తప్పకుండా పాటించా లన్నారు.
అభ్యర్ధులు హాల్ టికెట్ తో పాటు ఒక కలర్ ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డు(Original Aadhaar Card)/ డ్రైవింగ్ లైసెన్స్/ఉద్యోగి గుర్తింపు కార్డ్/ఓటర్ గుర్తింపు కార్డ్ ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసు కొని రావాల్సి ఉంటుందన్నారు.
హాల్ టికెట్ నందు ఫోటో సరిగ్గా కనిపించకపోయినట్లైతే 3-కలర్ ఫోటోలు తీసుకొని, హాల్ టికెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం చేయిం చుకొని రావలసిఉంటుంది.

అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ముందస్తుగా చూకు న్నట్లైతే, పరీక్ష రోజు పరీక్ష కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చు.
ఎగ్జామ్ రాయడానికి (బబ్లింగ్) బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ను మాత్ర మే అనుమతిస్తారని అన్నారు.
ఎగ్జామ్స్ హాల్ లోనికి మొబైల్ ఫో న్స్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్స్, వైట్ పేపర్స్, పెన్ డ్రైవ్స్, టాబ్లెట్స్, హియరింగ్ సొల్యూషన్స్ సంబంధిం చిన గాడ్జెట్స్ అనుమతించడం జర గదన్నారు.
ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత ఒంటిగంట వరకు ఎవ్వరిని బయ టకు పంపడం జరగదని, అభ్యర్థు లు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రశ్నా పత్రం తమతో పాటు తీసుకు వెళ్ళ డానికి వీలుగా ఉంటుంది అన్నారు.

అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీ స్, మాస్ కాపింగ్ చేసినట్లు తేలితే చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకో వడం జరుగుతుందన్నారు.

police security for Group-1 Prelims exam