Polling percentage: పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం
నల్గొండ పార్లమెంటు నియోజ కవర్గం పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచం దన తెలిపారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ పార్లమెంటు నియోజ కవర్గం(Parliament elections) పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్(Polling) ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచం దన తెలిపారు.సోమవారం పార్ల మెంటు ఎన్నికల పోలింగ్ ప్రారంభ మైన వెంటనే ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని 69 వ పోలింగ్ కేంద్రం లో క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పట్టణం లోని సైంట్ ఆల్ఫాన్సీస్ పాఠశాల, జిల్లా విద్యాశిక్షణ సంస్థలలో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఓటు వేసేందుకు ఓటర్లు తీసుకువచ్చిన గుర్తింపు కార్డులను ,వీల్ చైర్లు, షామియానా, మెడికల్ కిట్లు,ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు తదితర సౌకర్యాలను,ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 1:00 గంట వరకు నల్గొండ పార్లమెంట్ పరిధిలో 48.48% పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు .పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగడంలేదని, ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నదని తెలిపారు.
పోలింగ్ లో మహిళలు, ట్రాన్స్ జెండర్లు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఓట్లు వేస్తున్నారని, ఇది శుభ పరిణామం అని ,ఈ విడత ఎన్నికలలో(Election polling) పోలింగ్ శాతం గతంతో పోలిస్తే పెరిగేందుకు అవకా శం ఉందని ఆమెఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో 61 వేల మంది యువత నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వీరందరు ఓటు హక్కు వినియోగిం చుకునేందుకు అనేక ఓటరు చైత న్య కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే అన్ని నియోజకవర్గా లలో మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు, ఉమెన్ మేనేజెడ్ పోలింగ్ కేంద్రాలు, దివ్యంగా పోలింగ్ కేంద్రా లు ఏర్పాటు చేశామని, ప్రత్యేకించి మహిళలు యువతను ఆకట్టుకునే విధంగా సాంప్రదాయ పద్ధతిలో మోడల్ పోలింగ్ కేంద్రాలను పెళ్లిళ్ల కు అలంకరించే విధంగా పందిళ్లతో కొబ్బరి ఆకులు ,మామిడి తోరణా లతో ప్రకృతి సిద్ధంగా రూపొందిం చామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో(Polling center ) నీడ కోసం టెంట్లు, తాగునీరు, టాయిలె ట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు ,ఆశ, అంగన్వాడి కార్యకర్త స్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నా రు. మధ్యాహ్నం వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు చోటుచేసులేదని, ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినట్లయితే తమ దృష్టికి వస్తే తక్షణమే కొత్తవా టిని ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల పోలింగ్ ను వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతున్నదని, దీంతోపాటు అన్ని నియోజకవ ర్గాలతో సహాయ రిటర్నింగ్ అధి కారులు, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అలా గే ఎఫ్ ఎస్ టి ,ఎస్ ఎస్ టి బృందా లు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టోరల్ అధి కారులు, జిల్లా అధికారులతో పోలింగ్ ను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కాగా నల్గొండ జిల్లా కేంద్రంలో 69వ పోలింగ్ కేంద్రాన్ని వేణు మోడల్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్య వంశీ పరిశీలించారు.
Polling percentage increased