— రెవిన్యూ ,గృహ నిర్మాణ శాఖ మంత్రి g
ప్రజా దీవెన, నల్లగొండ: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల వివరాలను జాగ్రత్తగా సేకరిం చాలని రాష్ట్ర రెవిన్యూ ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరి శీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, సంక్షేమ హాస్టల్లలో పెంచిన డైట్ చార్జీల ప్రారంభం తదితర అంశా లపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు.ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవ త్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు , ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే లను విజయవంతంగా నిర్వహిం చినందుకు గాను ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రం గాలను అభినందించారు.
ప్రజా పాలన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలన్నింటిని ఈ నెలాఖరు లోగా పకడ్బందీగా సేకరించాలని , ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల దరఖాస్తులు రాగా, యాప్ ద్వారా 80 లక్షల దరఖాస్తులకు సంబంధించి సంపూర్ణ వివరాలు ఈ నెలాఖరు లోపు సేకరించాలని, ప్రతి 500 ఇండ్ల దరఖాస్తుల సర్వే కోసం ఒక సర్వేయర్ ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పంచాయతీలు,మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను నియమించామని, వీరిని సమన్వయం చేసుకుంటూ వివరాల సేకరణ జరగాలని, షెడ్యూల్ ముందస్తుగానే ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సేకరించే డేటా రాబోయే 4 సంవత్సరాలు ఉపయోగ పడుతుందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పక్కాగా వివరాల సేకరణ ఉండాలని అన్నారు. ఈ సర్వేలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటో నమోదు చేయాలని అన్నారు. ఈనెల 15 ,16 తేదీలలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలపై మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు అందించే డైట్ చార్జీలను 40 శాతం పెంచిందని, డిసెంబర్ 14న జిల్లాలలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, మాడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజిబీవి లో 40% డైట్ చార్జీల పెంపు ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు విద్యా సంస్థలను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని, పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేలా చూడాలని అన్నారు. హస్టల్స్ కు సన్న రకం బియ్యం సరఫరా చేస్తున్నామని, ఇందులో అధికంగా నూక వస్తుందని ఫిర్యాదులు ఉన్నాయని వీటిని పరిశీలించి కలెక్టర్లు నాణ్యమైన బియ్యం, విద్యాసంస్థలకు చేరేలా చూడాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి మాట్లాడుతూ ప్రజా పాలన ద్వారా సేకరించిన దరఖాస్తులను సర్వేయర్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కొసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు యాప్ ద్వారా సిబ్బంది వివరాల సేకరణకు వస్తున్నారని ముందస్తు సమాచారం అందించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం నూతన దరఖాస్తులు తీసుకోవడానికి వీలు లేదని, పాత దరఖాస్తుల పరిశీలన కొసం మాత్రమే సర్వే చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. ప్రతి సర్వేయర్ రొజుకు 20 ఇండ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేయాలని అన్నారు.
డైట్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని, ముఖ్యంగా తల్లి హాజరయ్యే విధంగా చూసుకోవాలని అన్నారు.14 న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డైట్ చార్జీల పెంపు ప్రారంభించే కార్యక్రమం జరగాలని, ప్రతి విద్యా సంస్థ మెన్యు కు సంబంధించి వివరాల ఫ్లెక్సీ ప్రచురణ చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, అడిషనల్ ఎస్పి రాములు నాయక్, గృహ నిర్మాణం పీడీ రాజ్ కుమార్ ,జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.