–డయాలసిస్ సౌకర్యాలను మరిం త పెంచాలి
–ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి
పాలడుగు ప్రభావతి డిమాండ్
Prabhavathi: ప్రజా దీవెన దేవరకొండ: రోజు రోజు కు పెరుగుతున్న రోగుల సంఖ్య కను గుణంగా వేగవంతంగా దేవర కొండ ప్రభుత్వ ఆసుపత్రిని అదనం గా వంద పడకల ఆసుపత్రిగా తీర్చి దిద్దాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్య దర్శి పాలడుగు ప్రభావతి (prabhavathi) ప్రభు త్వాన్ని డిమాండ్ (demand) చేశారు.నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ దావకానా ల పనితీరుపై ఐద్వా జిల్లా కమిటీ సర్వేలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే బుధవారం దేవరకొండ ప్రభుత్వ దావకానను (government hospital) 5వ జిల్లా కమిటీ సందర్శించి అక్కడి రోగుల తో మాట్లాడి వైద్య బృందంతో మా ట్లాడి అక్కడ పరిస్థితులపై తెలు సుకోవడం జరిగింది. ఈ సందర్భం గా పాలడుగు ప్రభావతి (prabhavathi) మాట్లాడు తూ దేవరకొండ ప్రాంతము అంటేనే నిరుపేద గిరిజనులతో కూడుకున్న ఒక సమూహమని ఈ ప్రాంత ప్రజ లంతా దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారే అన్నారు.
ఈ ప్రాంత ప్రజలు అధికంగా ప్రభుత్వ వైద్యాన్ని నమ్ము కునే జీవనాన్ని కొనసాగిస్తారని వార న్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నందువల్ల ఈ ప్రభుత్వాసుపత్రికి జిల్లా కలెక్టర్ (collector) గారు చొరవ తీసుకొని అదనంగా 100 పడకలు కేటాయించాలని వారు కోరారు. వైద్యులు సమయపాలన పాటించి సకాలంలో వైద్యం అందించాలన్నారు.ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కొంత మౌలిక వసతుల ప్రతిస్తంభన కనపడుతుందని మంచినీటి సౌకర్యంతో పాటు మిగతా మౌలిక వస్తువులను సంపూర్ణంగా కల్పించాలన్నారు. అదనంగా డయాలసిస్ (dialysis)బెడ్స్ ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు పద్మ,పద్మ, పుష్పల త,లక్ష్మి విజయ్ కెవిపిఎస్ రమణ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.