Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prajavani applications:ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి చందన జిల్లా అధికారులను ఆదేశించారు.

డివిజన్, మండల స్థాయిలో అధికారులు సమస్యలను పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి

రెండున్నర నెలల తర్వాత ప్రారంభమైన ప్రజావాణి

ప్రజా దీవెన నల్గొండ:  ప్రజావాణి(Prajavani) కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను ( applications) తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి చందన(Dasari hari chandana) జిల్లా అధికారులను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల వద్ద నుండి వారి సమస్యల పై దరఖాస్తులను స్వీకరించారు. రెండున్నర నెలల తర్వాత తిరిగి నిర్వహించిన ఈ ప్రజా వాని కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్ కు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు వచ్చి వారి సమస్యలపై జిల్లా కలెక్టర్ కు, అధికారులకు దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరిస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే అధికారులను తన వద్దకు పిలిపించుకొని పరిష్కారo చేయగా, మరికొన్ని పరిశీలించి విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ ప్రజావాణి(Prajavani applications) ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలని, జాప్యం చేయవద్దని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు, డివిజన్, మండల స్థాయిలో వచ్చే దరఖాస్తులను సైతం ఇలాగే పరిష్కరించాలని, ఆ విధంగా అన్ని స్థాయిలలో అధికారులు పనిచేయాలని కోరారు.

దరఖాస్తుదారులు సమర్పించిన ఫిర్యాదుల పరిష్కారం గురించి ఫిర్యాదుదారులకు తెలియజేయాలని, పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని పరిష్కరిస్థూ, పరిష్కరించలేని వాటి సమాచారాన్ని సైతం స్పష్టంగా తెలియజేయాల్సిందిగా ఆదేశించారు.ఈ వారం ప్రజావాణి దరఖాస్తులలో(Prajavani applications) వ్యక్తిగత సమస్యలతో పాటు, విద్య ,ఉద్యోగం, ఉపాధి, భూమి సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, డిఆర్ఓ రాజ్యలక్ష్మి తో పాటు, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

Prajavani applications solved