–ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో కా లువల పూడికతీత పనులకు మో క్షం
–డిస్ట్రిబ్యూటర్- 40 కాలువలో పూ డికతీత పనులు ప్రారంభం
–మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి రైతుల కృతజ్ఞతలు
Prateek Foundation: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ మండలంలోని కాలువలో పూడికతీత పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)తన సొంత ఖర్చులతో ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలువలో పేరుకుపోయిన పూడిక, చెట్లను తొలగించే కార్యక్రమాలను చేపట్టారు. సోమవారం పానగల్ ఉదయ సముద్రం నుంచి డి-40 మరియు సబ్ కాలువ L-1 కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. చిన్నసూరారం,పెద్ద సూరారం గ్రామాలలో జెసిబితో డి-40 కాలువలో చేపట్టిన పనులను నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ (Gummula Mohan Reddy, former ZPTC Wanguri Lakshmaiah, Nalgonda Market Committee Chairman Jukuri Ramesh.) పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy)సహకారంతో నల్గొండ నియోజక వర్గాన్ని శస్యశ్యామల చేయడం జరుగుతుందని తెలిపారు. కాలు వలో పూడిక తో పాటు కంప చెట్లు పెరగడంతో ఈ ప్రాంత రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డి-39, 40 కాలువలలో పూడికతీత పనులను చేపట్టడం జరిగిందని పేర్కొ న్నారు.ఈ పూడికతీత పనులు పూర్తయిన వెంటనే కాలువలకు నీటిని విడుదల చేయడం జరుగు తుందని పేర్కొ న్నారు.పూడికతీత వలన చివరి భూముల రైతుల కూడా సాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata reddy) ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఈ పూడికతీత పనులు చేపట్ట డంతో ఈ ప్రాంత రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నా రు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా (Mahila Congress Dist)మాజీ అధ్యక్షురాలు సుంకు ధనలక్ష్మి, పెద్ద సూరారం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి యాదగిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు కె.వి.ఆర్ సతీష్, కాంగ్రెస్ నాయకులు యరమద మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ,నరేష్ పటేల్ ,పురుషోత్తం ప్రవీణ్ భిక్షం ,లింగయ్య, కిన్నెర అంజి, సోమిరెడ్డి, బిక్షమయ్య నాగయ్య , పలువురు రైతులు ఉన్నారు.