Sun Stroke:ఎండల దృష్ట్యా జాగ్రత్తలు అవసరం
ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందుస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పి చందన దీప్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దు
ప్రజలక విజ్ఞప్తి చేసిన ఎస్పీ
ప్రజా దీవెన నల్గొండ క్రైమ్: ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు(High temperatures) నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ముందుస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పి చందన దీప్తి(SP Chandana Deepti )బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ముఖ్యంగా పిల్లలు వృద్దులు,బయటకు వెళ్ళకుండా ఉండే విధంగా జాగ్రత్త పడాలని సూచించారు.బయటకి వెళ్లి వచ్చిన తరువాత నీరసంగా అనిపించడం, ఒళ్లంతా వేడి కావడం, తలనొప్పి, వాంతులు,(vomiting)విరేచనాల వంటి లక్షణాలు కనబడితే తక్షణమే చక్కర, ఉప్పు(Salt) ద్రావణాన్ని తాగాలని, ఆ వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ కు చూయించుకోవాలని తెలిపారు.
ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ఎండ వేడిమి తగ్గాక ఉదయం, సాయంత్రం పూటనే పనులను చేసుకోవాలని పేర్కొన్నారు. బయటకు వెళ్ళవలసి వస్తే వదులు దుస్తులు, లేత, పలచటి దుస్తులు ధరించాలని, నిలువ ఉంచిన ఆహారం తినకూడదని, ద్రవపదార్థాలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.
precautions of sun stroke