–మూడోరోజు ఉత్సాహంగా సాగిన సభ్యత్వాలు
–సభ్యత్వాలు స్వీకరించిన సీనియ ర్ జర్నలిస్టులు, చిన్న పత్రికల ఎడిటర్లు
Press Club Memberships: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు (Press Club Memberships) జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న సీని యర్ జర్నలిస్టులతో ( senior journalists) పాటు చిన్న పత్రికల ఎడిటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నారు. సభ్యత్వాల సేకరణ మూడవ రోజు బుధవారం పెద్ద ఎత్తున సీనియర్ జర్నలిస్టులు చిన్న పత్రికల ఎడి టర్లు సభ్యత్వాలను స్వీకరించారు. నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులిమామిడి మ హేందర్ రెడ్డి, గాదె రమేష్ లు జర్న లిస్టులకు సభ్యత్వలను అం దజే శారు. ఈ సంధర్బంగా వారు మా ట్లాడుతూ చిన్న పత్రిక ఎడిటర్లు 30 మంది ప్రెస్ క్లబ్ సభ్యత్వం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. చిన్న పత్రిక ఎడిటర్లు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలం గాణ, నవ తెలంగాణ (Small magazine editors, Sakshi, Andhra Jyoti, Namaste Telam Gana, Nava Telangana) దినపత్రిక డెస్క్ జర్నలిస్టులు యావత్తు ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా చేరడం ప్రెస్ క్లబ్ కు ఎంతో బలం చేకూర్చిన ట్లుగా భావిస్తున్నామన్నారు. అన్ని యూనియన్ ల సమ్మిళితంతో యూనియన్ ల రహితంగా పూర్తి స్థాయి స్వతంత్ర సంస్థగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. సోమవారం ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ప్రారంభించుకున్నామని బుధ వారం మూడవరోజు కొనసాగగా ఇప్పటి వరకు 130 మంది జర్న లిస్టులు సభ్యత్వం తీసుకున్నార న్నారని తెలిపారు.
ఇంకా మిగిలిన జర్నలిస్టులు గురువారం సభ్యత్వం తీసుకోవడానికి ప్రెస్ క్లబ్ (Press Club)లో అందు బాటులో ఉంటామని చెప్పారు. మిగిలిన జర్నలిస్టులు సైతం సభ్య త్వం తీసుకోవడం ద్వారా జర్నలి స్టుల ఐక్యత చాటాలని కోరారు. గత పది సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్న ప్రెస్ క్లబ్ ను పునరుద్దరించు కొని ప్రతి ఒక్క జర్నలిస్టు సంక్షేమ మే ధ్యేయంగా ముందుకు సాగుతా మని స్పష్టం చేశారు. చిన్న పత్రిక ఎడిటర్ల గౌరవానికి ఎక్కడ బంగం కలగకుండా నడుచుకుంటామని అదే స్థాయిలో ప్రెస్ క్లబ్ యూనియన్ (Press Club Union) కు కూడా సంపూర్ణమైన మద్దతు భవిష్యత్తులో కూడా ఇదే స్థాయి లో కొనసాగించాలని కోరారు.
చిన్న పత్రికల సభ్యత్వం తీసుకున్న వారి లో సంపాదకులు ఎన్నమల్ల రమేష్ బాబు, మక్సుద్, భూపతి రాజు, షరీఫ్ బాబు, నారాయణ, టి. శ్రీనివాస్, ఆసిఫ్ అలీ, మోయిజ్, కారింగుల యాదగిరి, శ్రీనివాస్, వీరెల్లి సతీష్ తో పాటు పలువురు జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సభ్యత్యం తీసుకున్నారు. ప్రెస్ క్లబ్ సభ్యత్వం స్వీకరించిన జర్నలిస్టులను టియు డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండ గోని జయశంకర్ గౌడ్ ఘనంగా స న్మానించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు సల్వాది జాన య్య, ముచర్ల విజయ్, చింత యా దయ్య, దండంపల్లి రవికుమార్, సైదులు, కారింగు శ్రీనివాస్, సీని యర్ జర్నలిస్టు లు పాల్గొన్నారు.